టీ20 ప్రపంచకప్ 2024 సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన టీమ్ ఇండియాను ఘనంగా సన్మానించింది బీసీసీఐ. ముందుగా చెప్పినట్టే రూ.125 కోట్ల నగదు బహుమతిని చెక్ రూపంలో అందజేసింది. అంతకుముందు ముంబయి నగరంలో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించింది. నారీమన్ పాయింట్ నుంచి వాంఖడె స్టేడియం వరకు ఈ పరేడ్ ఉత్సాహబరితంగా సాగింది. లక్షలాదిగా అభిమానులు తరలివచ్చారు. అలా అభిమానుల సందడితో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. టీమ్ఇండియా ఆటగాళ్లు కూడా ఫ్యాన్స్ మధ్యలోని నుంచి వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఓపెన్ టాప్ బస్సులోంచి రోహిత్ శర్మ, కోహ్లీ, ఇతర ప్లేయర్స్ అభిమానులకు అభివాదం చేస్తూ ఫుల్ జోష్ నింపారు. ఈ వేడుకల్లో BCCI సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా పాల్గొన్నారు.
విశ్వవిజేతలకు ఘన సత్కారం - ముంబయిలో ముగిసిన టీమ్ఇండియా విక్టరీ పరేడ్ - T20 WORLD CUP LIVE - T20 WORLD CUP LIVE
Published : Jul 4, 2024, 11:22 AM IST
|Updated : Jul 4, 2024, 1:13 PM IST
Team India Road Show :టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియా 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. జూన 29న జరిగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసి గురువారం ఉదయం దిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. ఇక వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
ప్రధానితో భేటీ అయ్యాక టీమ్ఇండియా స్పెషల్ ఫ్లైట్‌లో ముంబయి చేరుకుంది. అక్కడ జరగనున్న భారీ రోడ్ షోలో పాల్గొంది. దీంతో ముంబయి బీచ్ రోడ్డు వద్ద అభిమానుల పోటెత్తారు. అభిమానుల క్రికెటర్లకు హర్టీ వెల్కమ్ చెబుతూ ఈలలు, కేకలతో సాగరతీరాన్ని హోరెత్తించారు. దీంతో ఆ ప్రాంతం జన సునామీని తలపించింది. ముంబయి అంతా అక్కడే ఉందా అనే సందేహాం కలుగుతోంది.
LIVE FEED
మైదానంలో ప్లేయర్స్ చిందులు
వాంఖడే స్టేడియానికి చేరుకున్నాక టీమ్ఇండియా ప్లేయర్స్ డ్రమ్ బీట్స్‌కు మైదానంలో చిందులేశారు. అనంతరం తన మనసులోని మాటలను పంచుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేయగా మిగతా క్రికెటర్లు కూడా వారితో కలిసి డ్యాన్స్ చేశారు. రోహిత్, రోహిత్, కోహ్లీ, కోహ్లీ, హార్దిక్, హార్దిక్ అని అభిమానులు చేసిన నినాదాలతో స్టేడిమం దద్దరిల్లింది.
హార్దిక్, సూర్యపై ప్రశంసలు - భారత కెప్టెన్ రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లోని కొన్ని అద్భుతమైన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన బౌండరీ క్యాచ్‌తో పాటు 20వ ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు హార్దిక్‌ను ప్రశంసించాడు.
రోహిత్ ఫోన్ కాల్ - భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టు నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత జట్టుకు కోచ్‌గా కొనసాగాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఫోన్ కాల్‌ను గుర్తుచేసుకున్నాడు.
రోహిత్‌ను ఇలా తొలిసారి చూశాను - "15 ఏళ్లలో రోహిత్ ఇంతలా ఎమోషన్ అవ్వడం నేను చూడటం ఇదే తొలిసారి. ఆ రాత్రి (2011 ప్రపంచకప్ విజయం తర్వాత) ఏడ్చిన సీనియర్ల ఎమోషన్లతో నేను కనెక్ట్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు అయ్యాను " అని రోహిత్ గురించి కోహ్లీ మాట్లాడాడు.
రిటైర్మెంట్‌కు చాలా కాలం ఉంది బాస్ - ప్రపంచ కప్ గెలవడం ఒక ప్రత్యేకమైన క్షణం అని బుమ్రా అన్నాడు. అలానే తాను ఆటకు గుడ్ బై చెప్పడానికి ఇంకా చాలా కాలం సమయం ఉందని పేర్కొన్నాడు.
వాంఖడే స్టేడియానికి టీమ్ఇండియా 'విజయ్ రథ్'
టీమ్ఇండియా 'విజయ్ రథ్' ఓపెన్ బస్ వాంఖడే స్టేడియానికి చేరుకుంది. 'ముంబయి రాజా రోహిత్ శర్మ (ముంబయి రాజు రోహిత్ శర్మ) సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. కాగా, వాంఖడె స్టేడియానికి కూడా ఇప్పటికే అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉచిత ప్రవేశం కల్పించడంతో స్టేడియంలో అన్ని స్టాండ్స్ అభిమానులతో కిటకిటలాడుతున్నాయి. మరి కాసేపట్లో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించి రూ.125 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకే రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా భారత ఆటగాళ్లు దిల్లీ నుంచి ముంబయికి ఆలస్యంగా చేరుకున్నారు. అభిమానులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ వల్ల కూడా ఈ రోడ్ షో ఆలస్యమైంది.
ముంబయిలో టీమ్ఇండియా రోడ్ షో ఇంకా కొనసాగుతోంది. భారీ సంఖ్యలో అభిమానులు క్రికెటర్ల బస్సును చుట్టముట్టడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులను ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేస్తూ రోడ్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం మరింత ఆలస్యం అయ్యేట్టు కనిపిస్తోంది.
ముంబయిలో జనసునామీ
టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన టీమిండియాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముంబయి బీచ్ రోడ్డు వద్ద అభిమానుల పోటెత్తారు. అభిమానుల క్రికెటర్లకు హర్టీ వెల్కమ్ చెబుతూ ఈలలు, కేకలతో సాగరతీరాన్ని హోరెత్తించారు. దీంతో ఆ ప్రాంతం జన సునామీని తలపించింది. ముంబయి అంతా అక్కడే ఉందా అనే సందేహాం కలుగుతోంది.
- ముంబయిలో ల్యాండ్ అయిన టీమ్ఇండియా ఫ్లైట్.
- ప్లేయర్ల రాక కోసం ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉన్న అభిమానులు
- మరికొద్ది సేపట్లో రోడ్ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ముంబయి వీధుల్లో సందడి చేస్తున్నారు. వాంఖడే స్టేడియంలో కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు.
- అభిమానుల రాకతో ముంబయి రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది.
- రోడ్ షో కోసం తయారు చేసిన బస్ ఇప్పుడే వాంఖడేకు చేరుకుంది.
- ప్లేయర్లను చూసేందుకు మరీన్ డ్రైవ్‌కు బారులు తీరుతున్న అభిమానులు
టీమ్ఇండియా ప్లేయర్లు భేటీ అయిన సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ జై షా, ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రధానికి ఓ స్పెషల్ గిఫ్ట్‌ను అందజేశారు. 'నమో 1' అనే అక్షరాలు ప్రింట్ చేసిన టీమ్ఇండియా జెర్సీని ఆయనకు అందజేశారు.
టీమ్ఇండియా ప్లేయర్లతో ముచ్చటించిన అనుభూతిని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
"మన ఛాంపియన్‌లతో అద్భుతమైన సమావేశం! 7, LKMలో ప్రపంచకప్ విజేతలతో భేటీ అయ్యింది. టోర్నమెంట్లో వారి అనుభవాల గురించి ఓ చిరస్మరణీయమైన సంభాషణ జరిపాం." అంటూ ప్లేయర్లతో దిగిన ఫొటోలను షేర్ చేసుకున్నారు.
- ముంబయి బయల్దేరిన టీమ్ఇండియా
- ప్రత్యేక విమానంలో ముంబయికి టీమ్ఇండియా
- ఇవాళ సాయంత్రం రోడ్ షోలో పాల్గొననున్న ప్లేయర్లు
- అనంతరం వాంఖడేలో ప్లేయర్లకు సన్మానం
మోదీతో టీమ్ఇండియా ఆటగాళ్లు గ్రూప్ ఫొటో దిగారు. ఆయనతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు.
- ప్రధానితో ముగిసిన భారత క్రికెట్ జట్టు సమావేశం
- టీ20 ప్రపంచకప్ సాధించిన జట్టును అభినందించిన ప్రధాని
- ఇవాళ మధ్యాహ్నం ముంబయి బయల్దేరనున్న టీమ్ఇండియా
- టీమ్ఇండియా విజయంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి ట్వీట్
- 'టీ20 వరల్డ్‌కప్ నెగ్గి, బర్బడోస్ గడ్డపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన టీమ్ఇండియాకు స్వాగతం' అని మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు.
- ప్రధాని నివాసానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టు
- టీ20 వరల్డ్‌కప్‌తో సగర్వంగా ఉదయం భారత్ చేరుకున్న క్రికెట్ జట్టు
- టీ20 ప్రపంచకప్ సాధించిన జట్టును అభినందించనున్న ప్రధాని
- సాయంత్రం ముంబయిలో టీమ్ఇండియా క్రికెటర్ల రోడ్ షో
- ఓపెన్ టాప్ బస్సులో ముంబయి ప్రధాన రహదారులపై ర్యాలీ