తెలంగాణ

telangana

ETV Bharat / sports

మన్మోహన్​ సింగ్​కు టీమ్ఇండియా ఘన నివాళి- నల్ల బ్యాండ్​లతో బరిలోకి - TEAM INDIA TRIBUTE TO EX PM

నల్ల బ్యాండ్​లతో బరిలోకి టీమ్ఇండియా- మాజీ ప్రధానికి నివాళి

Team India Tribute To EX PM
Team India Tribute To EX PM (Source : ANI, AP)

By ETV Bharat Sports Team

Published : Dec 27, 2024, 10:19 AM IST

Team India Tribute To Manmohan Singh :భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం మెల్​బోర్న్ టెస్టులో రెండో రోజు టీమ్ఇండియా ప్లేయర్లంతా నల్ల బ్యాండ్​లతో బరిలోకి దిగారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అనారోగ్యంతో గురువారం రాత్రి దిల్లీలో కన్నుమూశారు. దీంతో భారత ప్లేయర్లంతా చేతికి నల్లని బ్యాండ్​లు ధరించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈమేరకు బీసీసీఐ పోస్ట్ షేర్ చేసింది. 'గురువారం రాత్రి మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం టీమ్ఇండియా ప్లేయర్లు చేతికి నల్లటి బ్యాండ్ ధరించారు' అని రాసుకొచ్చింది.

కాగా, మన్మోహన్ సింగ్ 2004- 2014 మధ్య కాలంలో భారత ప్రధానిగా ఉన్నారు. ఆయన కాలంలోనే టీమ్ఇండియా మూడు ఐసీసీ టైటిళ్లు సాధించింది. మహేంద్రసింద్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్​కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీల్లో భారత్ విజేతగా నిలిచింది.

ఇక మాజీ క్రికెటర్ల కూడా మాజీ ప్రధాని మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లందరూ సంతాపం ప్రకటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details