Rohit Sharma On World Cup :2024 టీ20 వరల్డ్‌కప్ టైటిల్ దక్కించుకోవడానికి ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా అమలుచేసిన స్ట్రాటజీని కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. ఈ స్ట్రాటజీలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్మార్ట్‌గా వ్యవహరించాడని రోహిత్ అన్నాడు. తన చాకచక్యంతో సౌతాఫ్రికా బ్యాటర్ల రిథమ్ బ్రేక్ చేశాడని చెప్పాడు.
'ఛేజింగ్‌లో సౌతాఫ్రితాకు 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. వాళ్లకు ఇంకా చాలా వికెట్లు ఉన్నాయి. మేమంతా కంగారు పడుతున్నాం. కానీ, కెప్టెన్ కంగారు పడినట్లు కనిపించకూడదు. అప్పుడు గేమ్‌ను స్లో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికే ప్రత్యర్థి బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నారు. ఆ రిథమ్‌లోనే వాళ్లు మ్యాచ్ కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఉంటారు. ఎలాగైనా ఆ రిథమ్ బ్రేక్ చేయాలి. అప్పుడే నేను ఫీల్డింగ్ సెట్ చేస్తూ, బౌలర్లతో మాట్లాడుతున్నా. ఆ మూమెంట్లో రిషభ్ తన టాలెంట్‌తో ఆటను కాసేపు నిలిపివేసి, వాళ్ల ఫ్లో దెబ్బతీశాడు. తన మోకాలికి ఏదో అయినట్లు కింద పడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి బ్యాండేజ్ వేస్తున్నాడు. దీంతో గేమ్ స్లో అయ్యింది. ఇక మ్యాచ్ ఎప్పుడు స్టార్ అవుతుందని క్రీజులో ఉన్న క్లాసెన్ వెయిట్ చేస్తున్నాడు. దీనివల్ల మేం గెలిచాం అని అనడం లేదు. కానీ, అక్కడ పంత్ తెలివిగా వ్యవహరించడం కలిసొచ్చింది' అని రోహిత్ తాజాగా పాల్గొన్న ఓ కామెడీ షో లో చెప్పాడు.