Celebrities Tributes Ratan Tata :ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ ప్లేయర్ రవిశాస్త్రితోపాటు పలువురు మాజీలు, అథ్లెట్లు ఆయనను తలచుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు.
'ఆయన మనసు బంగారం'- రతన్ టాటాకు క్రికెటర్ల ఘన నివాళి - RATAN TATA TRIBUTES
Celebrities Tributes Ratan Tata : రతన్‌టాటాకు ప్రముఖు ఆటగాళ్లు నివాళులర్పిస్తున్నారు. ఆయనను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Published : Oct 10, 2024, 9:09 AM IST
|Updated : Oct 10, 2024, 9:48 AM IST
మిస్టర్ రతన్ టాటా తన జీవితంలోనే కాదు మరణంలోనూ దేశాన్ని కదిలించారు. నేను ఆయనతో కలిసి కాస్త సమయం గడిపాను. కానీ, ఆయనను ఎప్పుడూ కలవని లక్షలాది మంది కూడా, ఈ విషయంలో నాలాగే బాధపడుతున్నారు. అది ఆయన ప్రభావం. జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమ నుంచి దాతృత్వం వరకు, తమను తాము చూసుకునే స్తోమత లేని వారి పట్ల మనం శ్రద్ధ వహించినప్పుడే నిజమైన పురోగతిని సాధించగలమని టాటా చూపించారు. మిస్టర్ టాటా. మీరు నిర్మించిన సంస్థలు, మీ వారసత్వం కొనసాగుతుంది' అని సచిన్ తెందూల్కర్ రతన్ టాటాతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించాడు.
- 'రతన్ టాటాది బంగారంలాంటి మనసు. ప్రతి ఒక్కరినీ బాగు చేయడానికి తన జీవితాన్ని గడిపిన వ్యక్తిగా మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు సర్ - రోహిత్ శర్మ
- 'ఎక్సలెన్స్, విజన్, వినయానికి ప్రతీక. ఇది సమాజానికి తీరని నష్టం. ఆయన కుటుంబంబానికి సంతాపం తెలుపుతున్నా' - రవిశాస్త్రి
- 'శ్రీ రతన్ టాటా జీ మరణ వార్త తెలిసి చాలా చింతిస్తున్నా. ఆయన ఓ విజనరీ గలవాడు. ఆయనతో జరిగిన సంభాషణను నేను ఎప్పటికీ మరచిపోలేను. టాటాజీ దేశానికి స్ఫూర్తినిచ్చాడు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి'- నీరజ్ చోప్రా
- 'మనం అసలైన భారత రతనాన్ని కోల్పోయాం. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తి. మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. ఓం శాంతి' - సేహ్వాగ్
- మన దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరైన శ్రీ రతన్ టాటా జీ మరణించారు. మన దేశానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి రోల్ మోడల్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులందరికీ సానుభూతి తెలుపుతున్నా ఓం శాంతి' - లక్ష్మణ్
- 'గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరం. మీరు చేసిన సహకారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి'- ధావన్