T20 WorldCup 2026 Qualified Teams : ప్రస్తుతం యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 తర్వాత జరగబోయే 2026 ప్రపంచకప్ ఎంతో కీలకం. అయితే భారత్, శ్రీలంక వేదికగా జరగబోయే ఈ టీ20 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించే జట్లు ఏవో తెలిసిపోయాయి. 2026 టీ20 ప్రపంచ కప్ కూడా ప్రస్తుత ఎడిషన్లాగే 20 జట్లతో జరగనుంది. ఇందులో 12 టీమ్స్ డైరెక్ట్‌గా అర్హత సాధించగా మిగతా ఎనిమిది బెర్త్‌లు కోసం క్వాలిఫయర్ పోటీల ద్వారా ఖరారు చేయనున్నారు.
ప్రస్తుతం ఈ ప్రపంచ కప్(2024)లోని మొదటి రౌండ్లోనే పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు నిష్క్రమించాయి. భారత్, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ సూపర్ 8కు అర్హత సాధించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ చివరి నిమిషంలో ఈ తదుపరి దశకు వెళ్లింది. ఇప్పుడీ 8 క్వాలిఫయింగ్ జట్లే నేరుగా 2026 టి20 ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించాయి. ఇక ఆతిథ్య దేశ హోదాలో లంక తొమ్మిదో జట్టుగా అర్హత సాధిస్తుంది.
మిగతా మూడు బెర్త్‌లు జూన్ 30 నాటికి ఉన్న ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం ప్రపంచ కప్ జరుగుతుండడంటో ఈ టోర్నీ రిజల్ట్స్ ర్యాంకింగ్స్‌ను ఎలాంటి ప్రభావితం చేయవు. దీంతో ప్రస్తుతమున్న ర్యాంకింగ్సే జూన్ 30 వరకు కొనసాగుతాయి. అంటే ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ వరుసగా ఒకటి నుంచి పదకొండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ ప్రస్తుతం ఆరో స్థానంలో, పాకిస్థాన్ ఏడో స్థానంలో, ఐర్లాండ్ పదకొండో స్థానంలో ఉన్నాయి.