T20 World Cup Records:2024 టీ20 వరల్డ్ కప్ సంబరం మరికొన్ని ప్రారంభం కానుంది. యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. 20 జట్లు మెగా టోర్నమెంట్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ పొట్టికప్ టోర్నీలో ఇప్పటివరకు అనేక రికార్డులు నమోదయ్యాయి. అయితే ప్రతి సీజన్లో గతేడాది రికార్డైన రికార్డులు తర్వాత ఏడాది బద్దలవడం సహజమే. అలా ఈ ఏడాది కూడా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పలు రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ ఉంది. మరి ఆ రికార్డులేంటో మీకు తెలుసా?
అత్యధిక ఫోర్లు:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. విరాట్ ఇప్పటివరకు 103 ఫోర్లు బాదాడు. అతడి తర్వాత స్థానాల్లో వరుసగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (91), ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ (86) ఉన్నారు. ఈ రికార్డును అందుకునేందుకు వీరికి ఛాన్స్ ఉంది.
వేగవంతమైన సెంచరీ:టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ అత్యధిక వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అతడు 2016లో ఇంగ్లాండ్‌పై 47 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అయితే నమీబియన్ క్రికెటర్ నికోలె లాఫ్టీ ఈటన్ ఈ ఏడాది అద్భుతమైన ఘనత సాధించాడు. అతడు 2024 ఫిబ్రవరిలో నేపాల్‌పై 33 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఇది పురుషుల ట20లోనే ఫాస్టెస్ట్ సెంచరీ. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో అందరి కళ్లూ అతడిపైనే ఉండనున్నాయి. తన ఫామ్ఇలాగే కొనసాగిస్తే గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది.
అత్యధిక క్యాచ్‌లు:సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేరిట టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డు ఉంది. 23 క్యాచ్‌లతో ఉన్న డివిలియర్స్ రికార్డ్ బ్రేక్ చేయడానికి డేవిడ్ వార్నర్ (21)తో మరో మూడు క్యాచ్‌ల దూరంలో మాత్రమే ఉన్నాడు.