తెలంగాణ

telangana

55 మ్యాచ్‌లు, 20 జట్లు - టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే - T20 WORLD CUP 2024

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 9:37 AM IST

T20 WORLD CUP schedule Full Details : ఓ అంకం ముగిసింది. రెండు నెలల పాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ ముగిసింది. కానీ అభిమానులు చింతించాల్సిన పని లేదు. వినోదానికేమీ కొదువ లేకుండా మరింత భారీ స్థాయిలో, మరింత తీవ్రతతో క్రికెట్‌ ప్రేమికులను అలరించేందుకు టీ20 వరల్డ్ కప్​ సిద్ధమైంది. పూర్తి వివరాలు స్టోరీలో

Source ANI
T20 world cup 2024

T20 WORLD CUP schedule Full Details :ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. మరో ఐదు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ మొదలై క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. 55 మ్యాచ్‌లు జరిగే ఈ ఈవెంట్‌లో 20 జట్లు తలపడనున్నాయి. తొలిసారి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న అమెరికా గడ్డపై 16 మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-ఏ మ్యాచ్‌లన్నింటికీ అమెరికానే ఆతిథ్యమిస్తుండగా, నాకౌట్ మ్యాచ్‌లు మొత్తం వెస్టిండీస్‌లో జరగనున్నాయి.

అమెరికాలోని ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్‌లలోని 9 వేదికల్లో మ్యాచులు జరుగుతుండగా, మిగిలినవి వెస్టిండీస్ అంటిగ్వా-బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్-గ్రెన్ డైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగా అతిథ్యమిస్తాయి. ఉదయం 5 గంటలు, 6 గంటలు, రాత్రి 8 గంటలు, రాత్రి 10:30, అర్ధ రాత్రి 12:30 ఇలా భిన్న సమయాల్లో మ్యాచ్ జరగనుండగా భారత మ్యాచులు ఆరంభమయ్యేది మాత్రం రాత్రి 8గంటలకు మాత్రమే. టీమిండియా మ్యాచ్‌లు జూన్ 2 నుంచి ఆరంభం కానున్నాయి.

టోర్నమెంట్ విధానం - అయితే ఈ టోర్నమెంట్​లో ఆడే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విడగొట్టారు. ఈ గ్రూపులోని ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఆడాల్సిందే. అలా ఆడి టాప్ 2లో నిలిచిన నాలుగు గ్రూపుల్లోని జట్లన్నీ కలిపి సూపర్ 8గా మారతాయి. మళ్లీ వాటిని రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్కడ కూడా టాప్ 2 సాధించిన ఇరు జట్లలోని నాలుగు టీంలు కలిపి సెమీఫైనల్‌లో పాల్గొంటాయి. ఏయే గ్రూపులో ఏయే జట్లు ఉన్నాయంటే..

గ్రూపు ఏ: భారత్, ఐర్లాండ్, కెనడా, పాకిస్తాన్, అమెరికా
గ్రూప్ బీ: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్
గ్రూప్ సీ: ఆఫ్గానిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్
గ్రూప్ డీ: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక

మ్యాచ్‌కు ఆటంకం కలిగితే - టై అయితే సూపర్ ఓవర్ ఆడిస్తారు. మళ్లీ టై అయితే ఫలితం తేలేవరకూ సూపర్ ఓవర్ జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా వర్షం వస్తే, కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. అది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ క్యాన్సిల్. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లకు మాత్రం 10 ఓవర్ల మ్యాచ్ ఆడాల్సిందే. తొలి సెమీ ఫైనల్, ఫైనల్ కోసం 190 నిమిషాల అదనపు సమయం, రిజర్వ్ డే ఉంది. సెకండ్ సెమీ ఫైనల్ కు రిజర్వ్ డే లేకపోగా దానికి బదులుగా 250 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. భారత్ నాకౌట్స్‌కు చేరితే సెకండ్ సెమీఫైనల్​ను గయానాలో నిర్వహిస్తారు.టీమ్​ఇండియా షెడ్యూల్ - జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో, అదే వేదికగా జూన్ 9న పాకిస్థాన్​తో, జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లు అన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకే జరుగుతాయి.

ABOUT THE AUTHOR

...view details