Suresh Raina Favourite Actor :టీమ్ఇండియా మాజీ ప్లేయర్లలో చిన్న తల సురేశ్ రైనాకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ధోనీ బెస్ట్‌ఫ్రెండ్‌గా, మంచి ప్లేయర్‌గానూ క్రీడాభిమానులకు ఎన్నో మర్చిపోలేని మూమెంట్స్‌ను ఇచ్చారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా కూడా ఆయనకూ ఇంకా విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన పలు క్రికెట్ ఈవెంట్స్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేసిన రైనా ఆయన ప్రొఫెషనల్ అలాగే పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా హీరోల్లో తనకు నచ్చిన వ్యక్తి ఎవరు అని యాంకర్ అడగ్గా, దానికి సౌత్ హీరోల్లో సూర్య అంటే ఇష్టమన్నారు. ఆ తర్వాత తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఫేవరేట్ అన్నారు. ఆయన డిఫరెంట్ యాక్టర్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుండగా, చెర్రీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చిన్న తల మాటలను ఇంకా ట్రెండ్ చేస్తున్నారు.
మిస్ట్ కూల్ విషయంలో రైనా బలమైన కోరిక
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని 2025 ఐపీఎల్ సీజన్‌లో ఆడాలన్న తన బలమైన కోరికను ఇటీవల సురేశ్ రైనా వ్యక్తం చేశాడు. గత ఏడాది ధోనీ ఆటతీరు చూసి అతడు ఈ ఏడాది కూడా ఆడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. 'MS ధోనీ ఐపీఎల్ 2025లో ఆడాలని నేను కోరుకుంటున్నాను' అని రైనా పేర్కొన్నాడు. గత IPL సీజన్‌లో ధోనీ దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు.