Sunrisers Hyderabad IPL 2024 :ఈ టోర్నీలో హైదరాబాద్ 200+ స్కోర్‌ను నాలుగు సార్లు నమోదు చేసింది. అంతే కాకూండా మెగా లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులను సాధించిన జట్టుగానూ చరిత్రకెక్కింది. ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యథిక పరుగులు చేసిన బెంగళూరు రికార్డును బ్రేక్ చేసింది. అంతే కాకుండా తమ రికార్డును తామే తిరగరాస్తూ ఏకంగా 287 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఈ స్కోర్‌ను మరే టీమ్ సాధించలేకపోయింగది. అలాంటి జట్టు ప్రత్యర్థులు నిర్దేశించిన 207, 213 పరుగుల లక్ష్యాలను ఛేదించలేకపోతోంది.
ఆ ముగ్గురి పొరపాటు వల్లనే
సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో 209 పరుగుల టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు చివరి వరకూ పోరాడింది. అయితే ఆ మ్యాత్లో కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక గత రెండు మ్యాచుల్లో అయితే సన్‌రైజర్స్ విజయానికి చేరువగా కూడా రాలేకపోయింది. అయితే ఈ మూడు మ్యాచుల్లోనూ టాప్ ఆర్డర్ ప్లేయర్లు సరైన పెర్ఫామెన్స్ ఇవ్వకపోవడం గమనార్హం.
అయితే సన్‌రైజర్స్ భారీ స్కోర్లు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్. కానీ ఈ ముగ్గురు ఛేజింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు. ఆ జట్టులోని మిగతా ప్లేయర్లైన నితీశ్ రెడ్డి, ఐదెన్ మార్‌క్రమ్, అబ్దుల్ సమద్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదేలా ఉంది.
యంగ్ ప్లేయర్స్ సంగతేంటి?
ఇప్పుడిప్పుడే ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న తెలుగుతేజం నితీశ్ రెడ్డి కూడా కొన్ని మ్యాచుల్లో మంచి స్కోర్ చేసి జట్టును ఆదుకున్నాడు. ఇక మరో యంగ్ ప్లేయర్ అబ్దుల్ సమద్ కూడా తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. కానీ ఛేజింలో వీరు కూడా టాప్లే ప్లేయర్లులా డీలా పడిపోతున్నారు. షహబాజ్ ఫర్వాలేదనిపిస్తున్నా కూడా అతడి పెర్ఫామెన్స్ జట్టుకు సరిపోవడం లేదు. సీనియర్ ప్లేయర్ ఏడెన్ మార్‌క్రమ్ కూడా జట్టును గెలిపించలేకపోతున్నాడు.
ఇదిలా ఉండగా, టాప్ ఆర్డర్ కష్టాల్లో ఉన్నప్పుడు మిడిలార్డర్ ప్లేయర్లు టీమ్ గెలుపుకు సహకరించాసి. కానీ, ఈ జట్టులో అది ఓ లోటులా మారిపోయింది. దీంతో సన్‌రైజర్స్ మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ గెలిస్తే తప్ప ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగ్గా ఉండవంటూ విశ్లేషకుల మాట.