Sunrisers Hyderabad IPL 2024:2024 ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ హాఫ్‌లో అదరగొట్టినప్పటికీ సెకండ్ హాఫ్‌లో కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. తొలి 7 మ్యాచ్‌ల్లో ఐదింట్లో నెగ్గిన సన్‌రైజర్స్ తర్వాత ఆడిన నాలుగింట్లో ఒకే విజయం నమోదు చేసింది. అది కూడా 1 పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై నెగ్గింది. ప్రస్తుతం 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 6 విజయాలతో నాలుగో స్థానం (12 పాయింట్లు)లో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింట్లో విజయం సాధించడం తప్పనిసరి.
అయితే అఫీషియల్‌గా ఏ జట్టు కూడా ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోయినా, టాప్‌లో ఉన్న కోల్‌కతా, రాజస్థాన్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం సన్‌రైజర్స్‌తో పాటు, చెన్నై సూపర్ కింగ్ (12 పాయింట్లు), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (12 పాయింట్లు), దిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం (మే 8) సన్‌రైజర్స్ సొంతగడ్డపై లఖ్‌నవూతో పోటీ పడనుంది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నెగ్గితే ప్లేఆఫ్స్ రేస్‌లో ముందడుగు వేయడమే కాకుండా లఖ్‌నవూ ఛాన్స్‌లు దెబ్బతీసినట్లవుతుంది. దీంతో సన్‌రైజర్స్‌కు లైన్ క్లియర్ అవుతుంది. ఒకవేళ లఖ్‌నవూతో మ్యాచ్‌లో ఓడితే చివరి రెండు మ్యాచ్ (గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్)ల్లో కచ్చితంగా నెగ్గాలి. లేకపోతే ఇతర జట్ల గెలుపోటములపై ఆధార పడాల్సి వస్తుంది. పైగా సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ (-0.065) కూడా మైనస్‌లో ఉంది. దీంతో సన్‌రైజర్స్ చివరి మ్యాచ్‌ల్లో కాస్త ఒత్తిడిలో పడే ప్రమాదం కాడా ఉంది. అందుకే సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.