Sunil Narine T20 World Cup 2024:వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ తన ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని ఆ జట్టు కెప్టెన్ రోమన్ పావెల్ అభిప్రాయపడ్డాడు. టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో ఈ మేరకు అతడిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న నరైన్ జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ రాణించగలడన్న నమ్మకంతో పావెల్ ఈ కామెంట్స్ చేశాడు.
'ఏడాది నుంచి నరైన్‌ను అడుగుతున్నా. మిగతా వాళ్లందరినీ అతడు దూరం పెట్టాడు. రిటైర్మెంట్ విషయంపై నరైన్‌తో మాట్లాడమని బ్రావో, పూరన్, పొలార్డ్‌ను కోరాను. పొట్టికప్నకు వెస్టిండీస్ జట్టును ఎంపిక చేసేలోపు అతడిని ఒప్పిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుత ఐపీఎల్‌లోనూ నరైన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాట్‌తో ఆదరగొడుతూ కేకేఆర్ జట్టుకు కీలకంగా మారాడు. అతడు తన ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా' అని పావెల్ అన్నాడు. కాగా, 2019లో భారత్‌తోనే అతడు చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇక గతేడాది అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక 2024 ఐపీఎల్లో సునీల్ నరైన్ అదరగొడుతున్నాడు. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. రీసెంట్గా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓపెనర్‌గా వచ్చి అద్భుత శతకం (109 పరుగులు)తో సత్తా చాటాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 6 మ్యాచ్‌ల్లో కలిపి నరైన్ 43.00 సగటు, 187.76 స్ట్రైక్ రేట్‌తో 276 పరుగుల చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. అటు బంతితోనూ రాణిస్తున్న నరైన్ 6.87 ఎకానమీ రేట్‌తో ఏడు వికెట్లు పడగొట్టాడు.