తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్​, విరాట్​ల ఫ్యూచర్ ఇక సెలెక్టర్ల చేతిలోనే! - వాళ్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు' - SUNIL GAVASKAR ABOUT ROHIT VIRAT

రోహిత్​, విరాట్​ టెస్ట్ కెరీర్ గురించి సునీల్ గావస్కర్ కామెంట్స్ - 'వాళ్ల ఫ్యూచర్ ఇక సెలెక్టర్ల చేతిలోనే! '

Sunil Gavaskar About Rohit And Virat
Virat Kohli, Rohit Sharma (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 8, 2025, 9:11 AM IST

Sunil Gavaskar About Rohit And Virat :టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తాజాగారోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వారి టెస్టు కెరీర్‌ భవితవ్యం సెలెక్టర్ల చేతిలో ఉందంటూ పేర్కొన్నారు. తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ సరైన అవకాశాలు కల్పించాలంటూ బీసీీసీఐ సెలెక్షన్‌ కమిటీకి సూచించారు.

"రోహిత్, కోహ్లి ఎంతకాలం కొనసాగాలన్న విషయంపై తుది నిర్ణయం సెలెక్టర్ల చేతిలో ఉంది. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)కు అర్హత సాధించడంలో భారత్‌ ఘోరంగా విఫలమైంది. ఎందుకిలా జరిగిందో ఆలోచించాల్సిన అవసం ఎంతో ఉంది. గత ఆరు నెలల్లో గెలవాల్సిన మ్యాచ్‌లన్నీ భారత్‌ ఓడిపోడానికి బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణమని నా అభిప్రాయం. జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటనతో డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం కానుంది. ఇందులో 2027 ఫైనల్‌కు ఎవరెవరు అందుబాటులో ఉంటారనే విషయాన్ని సెలెక్టర్లు ఆలోచించి మరీ జట్టును ఎంపిక చేస్తారని నేను అనుకుంటున్నా. రంజీ ట్రోఫీలో బాగా ఆడిన వాళ్లకు ఇందులో అవకాశం ఇవ్వకపోతే అంతర్జాతీయ స్థాయిలో వారు ఎలా ఆడుతారన్న విషయం ఎలా తెలుస్తుంది? నితీశ్‌ కుమార్‌ రెడ్డి ట్యాలెంట్​ను గుర్తించి, టెస్టు జట్టుకు ఎంపిక చేసిన అగార్కర్‌ టీమ్​కు నా అభినందనలు. భారత్‌లో ట్యాలెంట్​ ఉన్న పేసర్లు ఎంతో మంది మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. బుమ్రాపై ఇంక ఎటువంటి భారం పడకుండా చూడాలి. అతడితో నాణ్యమైన పేసర్లు కలిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌లను గెలవగలిగే బౌలింగ్‌ టీమ్​ను కలిగి ఉంటాం" అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

నన్ను పిలిచి ఉంటే బాగుండు
సిరీస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్​కు గావస్కర్‌ను పిలవకుండానే బోర్డర్‌ చేతుల మీదుగా ప్రదానం చేయించడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. కెప్టెన్ కమిన్స్​కు​ ట్రోఫీ ఇస్తున్న సమయంలో గావస్కర్ అక్కడే మైదానంలో కామెంటరీ చేస్తుండడం గమనార్హం. దీనిపై గావస్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'నేను ఇక్కడే ఉన్నా. ఆసీస్​ సిరీస్‌ నెగ్గింది. అదేమీ నాకు ఇబ్బందికరం కాదు. వాళ్లు బాగా ఆడి, విజయం సాధించారు. కానీ, ట్రోఫీని బోర్డర్‌తో కలిసి నేను కూడా అందిస్తే బాగుండేది. అయితే నేను కేవలం భారతీయుడిననే నన్ను పిలవలేదేమో. ఈ మ్యాచ్​కు ముందే నిర్వాహకులు నాకు ఓ విషయం చెప్పారు. ఈ టెస్టు డ్రా గా ముగిసినా, భారత్ ఓడినా నేను అవసరం లేదన్నారు. నాకేం బాధ లేదు. కానీ, ఇది బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ కదా మేమిద్దరం కలిసి ఇస్తే బాగుంటుందని అనిపించింది' అని సన్నీ తెలిపాడు.

9 ఏళ్లలో ఫస్ట్ టైమ్​! - టెస్టు ర్యాంకింగ్స్​లో మూడో ప్లేస్​కు టీమ్​ఇండియా ఢమాల్!

'ఒక్కడే మా అందర్నీ వణికించాడు- నా కెరీర్​లో చూసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ బుమ్రాదే'

ABOUT THE AUTHOR

...view details