తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెస్ట్ vs బెస్ట్: రైజర్స్- రైడర్స్- కప్పు కొట్టేదెవరో? - IPL 2024 - IPL 2024

SRH vs KKR IPL 2024: 2024 ఐపీఎల్ తుది ఘట్టానికి చేరుకుంది. సన్​రైజర్స్- కోల్​కతా చెన్నై వేదికగా ఆదివారం తలపడనున్నాయి. ఓ జట్టు మూడో టైటిల్​ కోసం పోరాడుతుండగా, మరో టీమ్ రెండో ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతోంది.

SRH vs KKR IPL 2024
SRH vs KKR IPL 2024 (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 7:40 AM IST

SRH vs KKR IPL 2024:2024 ఐపీఎల్​ ఫైనల్​కు రంగం సిద్ధమైంది. రెండు పటిష్ఠమైన జట్ల మధ్యే తుదిపోరు జరగనుంది. లీగ్ స్టేజ్​లో టాప్- 2లో నిలిచిన జట్లు సన్​రైజర్స్ హైదరాబాద్- కోల్​కతా నైట్​రైడర్స్ టైటిల్ కోసం అమీతుమి తేల్చుకోనున్నాయి. ఆదివారం చెన్నై చిదంబరం స్టేడియం ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్​కు వేదికగా కానుంది. ఓవైపు 10ఏళ్లుగా మూడో టైటిల్​ కోసం ఎదురుచూస్తున్న కోల్​కతా, మరోవైపు రెండో ఐపీఎల్ ట్రోఫీని నెగ్గాలనే పట్టుదలతో సన్​రైజర్స్ ఉన్నాయి. బలాబలాల్లో సమవుజ్జీల్లా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండడం ఖాయం.

బెస్ట్ vs బెస్ట్:ఈ రెండు జట్లలో ఏది టైటిల్ ఫేవరెట్ అని చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇరుజట్లు లీగ్ స్టేజ్​లో అదిరే ప్రదర్శనతోనే ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టాయి. దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్లు సాధించడంలో సన్​రైజర్స్​కు పేరు ఉంటే, నిలకడ ప్రదర్శనతో ఆల్​రౌండ్​ ఆధిపత్యం చలాయించడంలో కోల్​కతాకు సాటి లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్​ త్రయం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. రాహుల్ త్రిపాఠి, షాహబాజ్ అహ్మద్, నితీశ్ రెడ్డి రాణిస్తే సన్​రైజర్స్​కు భారీ స్కోర్ ఖాయం. స్పిన్ బౌలింగ్​లో సన్​రైజర్స్ కాస్త వీక్​గా కనిపించినా క్వాలిఫయర్- 2లో అభిషేక్, షహబాజ్ ఆ సందేహం పోగొట్టారు. ఇక మరోసారి ఆల్​రౌండ్ ప్రదర్శన చేస్తే హైదరాబాద్​కు రెండో టైటిల్ నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు.

మరోవైపు కోల్​కతా కూడా ప్రమాదకర జట్టే. ​కేకేఆర్​ను తక్కువ అంచనా వేయలేం. సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ మెరుపు ఆరంభాలు ఇస్తున్నారు. శ్రేయస్, వెంకటేశ్‌ అయ్యర్, రసెల్, రింకుతో కేకేఆర్ బ్యాటింగ్ పటిష్ఠంగానే ఉంది. ఇక హైదరాబాద్‌తో పోలిస్తే కోల్‌కతాకు బలమైన బౌలింగ్‌ విభాగం ఉంది. స్పిన్నర్ వరణ్ చక్రవర్తి గతకొన్ని మ్యాచ్​ల్లో అదరగొడుతున్నాడు. అతడని సన్​రైజర్స్ జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పేసర్లు స్టార్క్, హర్షిత్‌ రాణా, వైభవ్‌ కూడా ఫామ్​లో ఉన్నారు. అందుకే కోల్‌కతాను సన్​రైజర్స్ ఈజీగా తీసుకోవడానికి లేదు.

రిజర్వ్ డే: ఐపీఎల్‌-17 ఫైనల్‌ మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఆదివారం రాత్రి జల్లులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా. అయితే మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేదు. ఒకవేళ అలా జరిగినా సోమవారం రిజర్వ్‌ డే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు.

  • ఐపీఎల్‌ ఫైనల్​లో​ కోల్‌కతా- సన్‌రైజర్స్‌ తలపడడం ఇదే తొలిసారి.
  • ఐపీఎల్‌ చరిత్రలో ఈ జట్ల మధ్య 27 మ్యాచ్​లు జరిగాయి. అందులో కేకేఆర్ 18 నెగ్గగా, సన్‌రైజర్స్‌ తొమ్మిదింట్లో విజయం సాధించింది.
  • రాత్రి 7.00 గంటలకు టాస్, 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
  • మ్యాచ్ అనంతరం గ్రాండ్​గా ముగింపు వేడుకలు ఉండనున్నాయి.

'అభిషేక్‌ అదుర్స్​- టీమ్ఇండియాకు అతడే బలం!' - IPL 2024

పాట్ కమిన్స్ అరుదైన ఘనత - RR x SRH​ మ్యాచ్​లో నమోదైన రికార్డులివే! - IPL 2024 SRH Final

ABOUT THE AUTHOR

...view details