తెలంగాణ

telangana

ETV Bharat / sports

సినిమా చూస్తుంటే కెప్టెన్​ కాల్ వచ్చింది - లేకుంటే ఆ పని చేసుండేవాడిని : శ్రేయస్‌ అయ్యర్ - SHREYAS IYER INDIA VS ENGLAND

అనూహ్యంగా తొలి వన్డేలోకి శ్రేయస్‌ అయ్యర్ - జట్టులో ఛాన్స్ గురించి ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్

Shreyas Iyer India vs England
Shreyas Iyer (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Feb 7, 2025, 11:16 AM IST

Shreyas Iyer India vs England :నాగ్​పుర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా అదరగొట్టింది. అటు బౌలింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​తోనూ ఇంగ్లాండ్​ జట్టును బెంబేలెత్తించి విజయం సాధించింది. అయితే అందరి దృష్టి మాత్రం అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్​పై పడింది. సడెన్​గా వచ్చినప్పటికీ సెస్సేషన్​గా ఆడి సత్తా చాటాడు. ఓపెనర్లు పెవిలియన్ చేరుకున్న తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్​, వైస్‌ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి మూడో వికెట్‌ సమయానికి 94 పరుగులు జోడించాడు. ఈక్రమంలో కేవలం 36 బంతులకే 59 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తాజాగా తను జట్టులోకి ఎలా వచ్చాడన్న విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు.

"మ్యాచ్‌ జరగనున్న ముందురోజు రాత్రి నేను ఓ సినిమా చూస్తూ ఉన్నాను. ఆ రాత్రంతా నేను దాన్ని అలానే చూస్తూ ఉండాలనుకున్నా. ఎలాగో ఛాన్స్‌ రాదనే ఫీలింగ్​తో అలా చేయాలనుకున్నా. అయితే అప్పుడే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. విరాట్​కి మోకాలిలో వాపు వచ్చింది. అందుకే నువ్వు ఈ మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుంది అని అన్నారు. ఇక ఆ మాట విన్న వెంటనే నేను నా రూమ్‌కు వెళ్లి నిద్రపోయాను. అందుకే, నాకు ఈ విజయం, ఈ ఇన్నింగ్స్‌ రెండూ కచ్చితంగా గుర్తుండిపోతాయి. విరాట్‌కు గాయం కావడం వల్లే నాకు ఈ ఛాన్స్ దక్కింది. అయితే నేను ఈ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగానే ఉన్నా. ఎప్పుడైనా ఛాన్స్‌ వస్తుందని నాకు తెలుసు" అని శ్రేయస్ అసలు విషయం చెప్పుకొచ్చాడు.

గతంలో నాకు ఇలా జరిగింది
గతంలోనూ తనకు ఇటువంటి అనుభవం ఎదురైందని శ్రేయస్ ఈ సందర్భంగా తెలిపాడు. "ఇలాంటిదే గత ఆసియా కప్‌లోనూ జరిగింది. నేను గాయపడటం వల్ల నా స్థానంలో మరొకరిని ఆడించారు. అయితే ఆ మ్యాచ్​లో సెంచరీ సాధించాడు. ఇలా జరగడం చాలా కామనే. నేను గత దేశవాళీ సీజన్‌ మొత్తం ఆడాను. అక్కడ నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఒక ఇన్నింగ్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయాలను తెలుసుకున్నాను. నా వైఖరిని నేను అస్సలు మార్చుకోలేదు. అయితే నేను ఆడే విధానంలో మాత్రం కాస్త మెరుగుపర్చుకున్నా" అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లాండ్​తో తొలి వన్డేలో భారత్​ ఘన విజయం - అదరగొట్టిన శుభమన్​ గిల్​

విరాట్​ కోహ్లీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడతాడా? మెగా టోర్నీకి ముందు డౌట్స్ ఎన్నో!

ABOUT THE AUTHOR

...view details