తెలంగాణ

telangana

ETV Bharat / sports

షోయబ్ మాలిక్ 'మూడో పెళ్లి'- సానియా పరిస్థితేంటి? - Sania Shoaib Son

Shoaib Malik Marriage: పాకిస్థాన్ మాజీ క్రికెట్రర్ షోయబ్ మాలిక్ మూడోసారి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్​కు చెందిన నటి సనా జావేద్​ను షోయబ్ శనివారం వివాహం చేసుకున్నాడు.

Shoaib Malik Marriage
Shoaib Malik Marriage

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 12:33 PM IST

Updated : Jan 20, 2024, 2:46 PM IST

Shoaib Malik Marriage:పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ శనివారం (జనవరి 20) మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్​ను షోయబ్ మూడో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈ కపుల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గతేడాది సనా జావేద్ పుట్టిన రోజున షోయబ్ ఆమెకు సోషల్ మీడియాలో విషెస్ తెలుపడం వల్ల ఈ వార్తలకు బలం చేకూరింది. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటై ఈ వార్తలను నిజం చేశారు. దీంతో సనా షోషల్ మీడియా ఖాతాలో తన పేరును 'సనా షోయబ్ మాలిక్​' గా మార్చేసింది. అటు సనా జావేద్​కు కూడా ఇది రెండో పెళ్లి. ఆమె 2020లో ఉమెర్ జైస్వాల్ అనే సింగర్​ను వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల 2023లో వీరిద్దరూ విడిపోయారు.

కాగా, షోయబ్ మాలిక్ 2010లో తన మొదటి భార్య అయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చి, అదే సంవత్సరం ఏప్రిల్​లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జాను పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరికి 2018లో ఇజహాన్ అనే అబ్బాయి జన్మించాడు. అయితే గత కొద్దికాలంగా షోయబ్, సానియా విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీరి కుమారుడు ఇజహాన్ పుట్టినరోజు వేడుకల్లో కూడా సానియా, షోయబ్​తో కలిసి ఫొటో దిగలేదు. కుమారుడితో కలిసి షోయబ్ ఒక్కడే ఫొటోకు ఫోజివ్వగా, సానియా ఫ్రేమ్​లో ఉన్నప్పటికీ కెమెరాను చూడలేదు.

దీంతో వీరు విడిపోతున్నారన్న వార్తలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో రీసెంట్​గా సానియా ఇన్​స్టాగ్రామ్​లో ఈ విషయంపై స్పందించింది. 'పెళ్లి అనేది కష్టమైనది. డివోర్స్ కూడా అంతే కష్టమైంది. ఏది కావాలో తెలివిగా ఆలోచించాలి' అని పోస్ట్ షేర్ చేసింది. ఈ నేపథ్యంలో షోయబ్​కు వివాహం జరగడం హాట్​ టాపిక్​గా మారింది. అయితే ముస్లిం స్త్రీ కి ఉండే హక్కు ప్రకారం సానియా తనవైపు నుంచి, షోయబ్​కు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయంపై ఆమె నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

PCB ఛైర్మన్ పదవికి అష్రఫ్ రాజీనామా- వరుస వైఫల్యాలే కారణం!

విండీస్​ నయా పేస్‌ సంచలనం - బాడీగార్డ్‌ నుంచి బౌలర్​గా!

Last Updated : Jan 20, 2024, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details