Shikhar Dhawan Best Century : టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికి అభిమానులను విస్మయానికి గురి చేశాడు. భారత జట్టు తరపున ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్, తన కెరీర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ఒకదానిని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యాడు. బొటన వేలు ప్రాక్చర్ అయినా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ శతకం చేసిన ఆ ఇన్నింగ్స్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటని శిఖర్ గుర్తు చేసుకున్నాడు. అయితే టెస్ట్ అరంగేట్రం మ్యాచ్‌లో చేసిన 187 పరుగుల కంటే తనకు ఆ ఇన్నింగ్స్‌నే తాను టాప్‌లో ఉంచుతానని శిఖర్ అన్నాడు.
అది మాములు శతకం కాదు మరి
తన తొలి మ్యాచ్‌లోనే అది ఆస్ట్రేలియాపైన శిఖర్ 187 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మాములుగా ఎవరైనా ఈ శతకాన్నే శిఖర్ అత్యుత్తమ శతకంగా భావిస్తుంటారు. అయితే ధావన్ మాత్రం తన మనసుకు నచ్చిన మరో సెంచరీనే టాప్ అంటూ చెప్పాడు. తొలి టెస్ట్ సెంచరీ అద్భుతమే అయినా టాప్ మాత్రం కాదని ధావన్ అన్నాడు.
ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 ప్రపంచ కప్ సందర్భంగా ఆస్ట్రేలియాపై ధావన్ 117 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ మొదటి బంతికి పాట్ కమ్మిన్స్ వేసిన బంతిని ఫుల్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ధావన్ బొటనవేలుకు గాయమైంది. వేలు ఫ్రాక్చర్ అయ్యింది.అయినా ధావన్ వెనుదిరిగలేదు. నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు.
రెండుసార్లు పెయిన్‌కిల్లర్లు తీసుకుని, ఫిజియోతో పలుసార్లు చికిత్స తీసుకుని ధావన్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఫిజియో చికిత్స చేస్తున్నప్పుడు నొప్పితో ధావన్ విలవిలలాడిపోయాడు. అంత నొప్పిలోనూ ధావన్ 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ చేశాడు. విరిగిన బొటనవేలుతోనే ధావన్ చేసిన ఈ సెంచరీ ఎందరినో ఆకట్టుకుంది.