Shakib Al Hasan Murder Case : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు తాజాగా షాక్ తగిలింది. అతడిపై హత్య కేసు నమోదైనట్లు అక్కడి మీడియా కథనాలు తాజాగా వెలువడుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే?
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇటీవల బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు జరగ్గా, అందులో రూబెల్ అనే యువకుడు మృతిచెందాడు. దీంతో ఆ అబ్బాయి తండ్రి రఫీకుల్ తాజాగా ఇస్లామ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన కుమారుడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనా గవర్నమెంటే కారణమని ఆరోపించారు.
ఇక ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దాని ఆధారంగా షేక్ హసీనాతో పాటు 154 మందిపై మర్డర్ కేసు నమోదు చేశారు. అందులో షకీబ్ అల్ హసన్ పేరు 28వ నిందితుడిగా ఉంది. ఈయనతో పాటు బంగ్లాదేశీ నటుడు ఫెర్దూస్ అహ్మద్ కూడా ఇందులో 55వ నిందితుడిగా నమోదయ్యాడు.
ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇద్దరూ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందుకే వారి పేర్లు నిండితుల లిస్ట్‌లో ఉంది. అయితే అల్లర్ల కారణంగా హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం వల్ల ఆమె ప్రభుత్వం రద్దయ్యింది. దీంతో ఈ ఇద్దరూ తమ పదవిని కోల్పోయారు.