తెలంగాణ

telangana

ETV Bharat / sports

'షమీ పెద్ద స్టారేమీ కాదులే- అతడి కంటే అర్ష్​దీప్ బెటర్!' - SHAMI CHAMPIONS TROPHY

సంజయ్ బంగర్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ 11- షమీ, పంత్​కు నో ప్లేస్!

Mohammed Shami
Mohammed Shami (Source : Getty Images, Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 19, 2025, 4:24 PM IST

Shami Champions Trophy :ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును సెలక్టర్లు శనివారం ప్రకటించారు. అందులో పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్​దీప్ సింగ్​కు చోటు కల్పించారు. అయితే పేస్ కాంబినేషన్ గురించి మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో మహ్మద్ షమీ పెద్ద స్టారేమీ కాదని అన్నాడు. అలాగే ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో బంగర్, తన ప్లేయింగ్ 11 జట్టను వెల్లడించాడు.

టోర్నీలో టీమ్ఇండియా ప్లేయింగ్ 11 కాంబినేషన్​పై బంగర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. బుమ్రా, అర్ష్​దీప్ పూర్తి స్థాయి ఫిట్​నెస్​తో ఉంటే వాళ్లిద్దరికే తొలి ప్రాధాన్యం ఇస్తానని అన్నాడు. 'జస్ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ ఫిట్​గా ఉంటే వాళ్లిద్దర్నీ పేసర్లుగా ఎంచుకుంటా. మహ్మద్ షమీని వదిలిపెట్టొచ్చు. షమీ పెద్ద స్టారేమీ కాదు. అతడు జట్టుకు బ్యాకప్​గా ఉంటాడు. ఇక రిషబ్ పంత్‌ రిజర్వ్ బెంచ్​కే పరిమితం. రవీంద్ర జడేజా లేదా అక్షర్ పటేల్​లో ఎవరికో ఒకరికే తుది జట్టులో చోటు' అని తాజాగా పాల్గొన్న ఓ షోలో బంగర్ వ్యాఖ్యానించాడు.

మరోవైపు, మహ్మద్ షమీ గాయం తర్వాత బంగాల్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడని బంగర్ తెలిపాడు. 'షమీ, కుల్దీప్ రాణించడం వల్ల మళ్లీ టీమ్ఇండియాకు ఎంపికయ్యారు. దేశవాళీలో షమీ తన జట్టుకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించాడు. దీంతో షమీ ఫిట్​నెస్ సాధించాడని అర్థమవుతోంది. అధిక తీవ్రతతో బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతడు ఇంగ్లాండ్‌తో జరిగే తొలి వన్డే నుంచి ఎక్కువ ఓవర్లు వెయ్యాలి. అప్పుడే షమీ ఫిట్​నెస్, ఫామ్ అందుకుంటాడు' అని బంగర్ పేర్కొన్నాడు.

బంగర్ ప్లేయింగ్ ఎలెవన్ :రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు ప్రకటన- గిల్​కు ప్రమోషన్, షమీ రీ ఎంట్రీ

రోహిత్ శర్మ, అజిత్ చాట్ లీక్! - మైక్ ఆన్​లో ఉందని తెలియక ఆ మాట అనేశాడుగా!

ABOUT THE AUTHOR

...view details