తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సచిన్ ప్యాంటులో చీమలు ఉండేవి!' - కోహ్లీ, తెందుల్కర్​​ నెట్ ప్రాక్టీస్​పై రవిశాస్త్రి - RAVI SHASTRI ON SACHIN VIRAT

కోహ్లీ, సచిన్​ నెట్ ప్రాక్టీస్​ సెషన్స్​ గురించి మాట్లాడిన మాజీ హెడ్ కోచ్​ రవిశాస్త్రి!

Kohli sachin
Kohli sachin (source IANS)

By ETV Bharat Sports Team

Published : Oct 25, 2024, 12:42 PM IST

Ravi Shastri on Sachin Virat Kohli Training Method : ప్రపంచ క్రికెట్​లో సచిన్ తెందుల్కర్​, విరాట్ కోహ్లీ ఇద్దరు దిగ్గజాలుగా పేరొందారు. తమ ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వీరిలో సచిన్ ఇప్పటికే రిటైర్​ అయిపోగా, విరాట్​ ఇంకా తన కెరీర్​ను కొనసాగిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు స్టార్​ ప్లేయర్ల నెట్​ ప్రాక్టీస్​ ట్రైనింగ్ సెషన్​​ గురించి టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్​ రవి శాస్త్రి మాట్లాడాడు. కాగా, రవిశాస్త్రి సచిన్​తో కలిసి ఆడగా, కోహ్లీ కెప్టెన్సీలో హెడ్​ కోచ్​గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి ట్రైనింగ్ మెథడ్ ఎలా ఉంటుందో వివరించాడు.

"కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌ను రెండుగా విభజించుకునేవాడు. నెట్​ బౌలర్లు ఎదుర్కోవడంతో పాటు సపోర్ట్ స్టాఫ్​తో స్పెషలైజ్​డ్​ సెషన్స్​ నిర్వహించేవాడు. వివిధ సవాలు పరిస్థితుల్లో బౌలింగ్​ను ఎదుర్కొనేందుకు దృష్టి పెట్టేవాడు.

ఇక సచిన్ తెందుల్కర్ విషయానికొస్తే అతడి హయంలో​ వయసులో ఉన్నప్పుడు ప్యాంటులో చీమలు ఉన్నట్టుగా ఉండేవాడు. అస్సలు ఖాళీగా ఉండేవాడు కాదు. ఎప్పుడు నెట్స్​లో బ్యాటింగ్ చేస్తూ కనిపించేవాడు. లేదంటే బౌలింగ్​, ఫీల్డింగ్​ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అతడిని కాసేపు కూడా సైలెంట్​గా, ప్రశాంతంగా, ఖాళీగా ఉంచలేం. 35 ఏళ్ల వయసులోనూ ఇంటెన్స్​గా(దూకుడుగా), ప్రణాళికబద్ధంగా ప్రాక్టీస్​ సెషన్ల్​లో పాల్గొనేవాడు సచిన్. ఇంకా చెప్పాలంటే అతడి ట్రైనింగ్​ మెథడ్​ చాలా సహజసిద్ధంగా, మెరుగుపర్చుకునేలా ఉండేది. బ్యాటింగ్ ప్రాక్టీస్ పూర్తవ్వగానే ఆటలోని ఇతర విభాగాలపై కూడా ఎంతో ఉత్సాహంతో పూర్తిగా దృష్టి సారించేవాడు." అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

IND VS NZ Second Test : ఇకపోతే ప్రస్తుతం టీమ్ ఇండియా న్యూజిలాండ్​తో రెండో టెస్ట్ ఆడుతోంది. ఈ రెండో టెస్టులో బౌలింగ్‌లో అదరగొట్టిన భారత జట్టు, బ్యాటింగ్‌లో తేలిపోయింది. పుణె వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో స్వల్ప వ్యవధిలోనే వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం రెండో రోజు లంచ్‌ బ్రేక్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.

డేవిడ్ వార్నర్‌పై 'జీవిత కాల' కెప్టెన్సీ నిషేధం ఎత్తివేత

కీలక మ్యాచుల్లో కుర్రాళ్లపై భారం! - పేలవ ఫామ్​తో రోహిత్, విరాట్ - ఇక రిటైర్మెంటేనా!

ABOUT THE AUTHOR

...view details