Sachin Tendulkar 100 Crore Deal :భారత్‌లో క్రికెటర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో సమానంగా వీరికి అభిమానులుంటారు. అందుకే పలు వాణిజ్య కంపెనీలు తమ ప్రమోషన్ కోసం క్రికెటర్స్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటాయి. అందుకుగాను భారీగా సొమ్ములు ముట్ట చెపుతాయి. అయితే మన దేశంలో తొలిసారిగా ఓ వాణిజ్య సంస్థతో రూ.100 కోట్ల డీల్ చేసుకున్న ఆటగాడు ఎవరో తెలుసుకుందాం.
వివరాళ్లికో వెళితే. భారత్‌తో క్రికెట్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ మెుదలైందంటే చాలు చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు టీవీలకు అతుక్కుపోతారు. అందుకే పలురకాల వాణిజ్య కంపెనీలు, సంస్థలు కోట్లు చెల్లించి మరీ క్రికెటర్లను తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తుంటాయి.అయితే భారత్‌లో తొలిసారిగా ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు రూ.100 కోట్ల డీల్ చేసుకున్న ప్లేయర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్. ఈ డీల్‌తో అతడు సరి కొత్త రికార్డు సృష్టించాడు. 2001లో 'వరల్డ్ టెల్' అనే సంస్థతో R ఒప్పందం కుదుర్చుకున్నాడు.
'వరల్డ్ టెల్' అనేది మర్క్ మస్కర్ అనే వ్యక్తికి చెందిన చెందిన స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థ. ఈ సంస్థతో సచిన్ చేసుకున్న ఈ మెగా డీల్ అప్పట్లో అందర్ని షాక్‌కు గురిచేసింది. కంపెనీ బ్రాండ్‌కు ప్రమోషన్ చేస్తే ఇంత పెద్ద మెుత్తంలో చెల్లిస్తారా అని అందరూ ఆశ్చర్యపోయారు. 2013లో సచిన్ తెందుల్కర్ అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ యాడ్లను ఇవ్వటంలో అతడి హవా మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఐటీసీ సావన్, జియో సినిమా, బీఎమ్ డబ్ల్యూ వంటి వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు.