SA vs Eng T20 Super 8 2024:2024 టీ20 వరల్డ్‌కప్ సూపర్- 8లో సౌతాఫ్రికా- ఇంగ్లాండ్ జట్లు సెయింట్ లుసియా వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ ప్రత్యర్థి ఇంగ్లాండ్ ముందు 164 పరుగుల టార్గెట్ ఉంచింది.
164 పరుగుల లక్ష్య ఛేదనలో పరుగులు చేయలేక, వికెట్లు కాపాడుకోలేక ఇబ్బంది పడింది ఇంగ్లాండ్. వెస్టిండీస్‌పై అదిరే ప్రదర్శన చేసిన సాల్ట్(11) రెండో ఓవర్లోనే వెనుదిరిగాడు. బెయిర్‌స్టో (16) కూడా ఎక్కువసేపు ఉండలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన బట్లర్ (17) కూడా తుస్సుమనిపించాడు. మొయిన్ అలీ (9) కూడా ఎంతోసేపు నిలవలేదు. ఈ క్రమంలోనే బ్రూక్, లివింగ్‌స్టన్ జోడీ కాసేపు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి సమీకరణాన్ని తేలిక చేసింది. 15-17 ఓవర్ల మధ్య ఈ జోడీ ఏకంగా 52 పరుగులు సాధించింది. దీంతో 17 ఓవర్లకు 139/4 స్కోరుతో నిలిచింది ఇంగ్లాండ్. కానీ తర్వాత మ్యాచ్ మళ్లీ మలుపు తిరిగింది. దీంతో మ్యాచ్ సఫారీల సొంతమైంది. కేశవ్ మహరాజ్ (2/25), రబాడ (2/32) వికెట్లు తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టులో ఓపెనర్ క్వింటన్ డికాక్ (65 పరుగులు; 38 బంతుల్లో: 4x4, 4x6) చెలరేగి ఆడడంతో ఆ జట్టు అలవోకగా 200 దాటేస్తుందనిపించించింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. అందులో డికాక్ వాటానే 49 పరుగులు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (19 పరుగులు), హెన్రీచ్ క్లాసెన్ (8 పరుగులు), ఎయిడెన్ మర్క్రమ్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (12) పరుగులు చేశారు. వరుసగా వికెట్లు పడుతున్న తరుణంలో చివరి ఓవర్లలో డేవిడ్ మిల్లర్ (43 పరుగులు) చేలరేగి ఆడాడు. మార్కో జాన్సన్ (0) పరుగుల ఖాతా తెరకుండానే పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
పాక్ క్రికెటర్లకు షాక్- సెంట్రల్ కాంట్రాక్ట్‌లు రద్దేనంట! - T20 World Cup 2024
డక్‌వర్త్ పద్ధతిలో ఆసీస్ విజయం - కమిన్స్ 'హ్యాట్రిక్' ఘనత - AUSTRALIA T20 WORLD CUP 2024