Gautam Gambhir On Dressing Room Rumors : బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని గతంలో వార్తలు వచ్చాయి. సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మతో హెచ్ కోచ్ గంభీర్‌కు విభేదాలు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. బోర్డర్- గావస్కర్ ట్రోఫీని టీమ్ ఇండియా ఓడిపోవడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమ్ ఇండియా గెలిచిన అనంతరం గంభీర్ ఈ విషయల గురించి క్లారిటీ ఇచ్చారు.
"టీమ్ఇండియా ఆటగాళ్లు చాలా కాలం నుంచి కలిసి క్రికెట్ ఆడుతున్నారు. నెల క్రితం టీమ్ఇండియా గురించి రెండు పుకార్లు వచ్చాయి. భారత క్రికెట్ అంటే అదే. పరిస్థితులు బాగాలేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఫలితాలు అనుకూలంగా మారితే పరిస్థితులు మారుతాయి." అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
హై రిస్క్‌తోనే హై రివార్డ్
హై-రిస్క్, హై -రివార్డ్ విధానాన్ని అనుసరించి టీ20 మ్యాచ్ ల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో క్రమం తప్పకుండా 250-260 రన్స్ సాధించడమే తమ లక్ష్యమని తెలిపాడు. ఈ ఆటలో తాము ఓడిపోతామని భయపడకూడదని అనుకుంటున్నామని పేర్కొన్నాడు.
"మేం హై-రిస్క్, హై -రివార్డ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. మా టీమ్ లోని ప్లేయర్లు దీన్ని బాగా ఒంటపట్టించుకున్నారు. మేం క్రమం తప్పకుండా 250-260 రన్స్ చేయాలని భావిస్తున్నాము. అలా చేసే ప్రయత్నంలో మా జట్టు కొన్నిసార్లు 120-130 స్కోర్లకే ఆలౌట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. టీ20 క్రికెట్ అంటే ఇదే. మనం అలాంటి హై-రిస్క్ క్రికెట్ ఆడకపోతే పెద్ద టోర్నీల్లో విజయాలు దక్కవు. " అని హెడ్ కోచ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.
మరోవైపు టీమ్ఇండియా సరైన మార్గంలోనే ఉందని తాను అనుకుంటున్నానట్లు గంభీర్ తెలిపాడు. మెగా టోర్నీల్లోనూ ఇలాంటి నిర్భయమైన ఆటను కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ఏదైనా కోల్పోతామని అస్సలు భయపడకూడదని వ్యాఖ్యానించాడు. అలాగే ఐదో టీ20 సెంచరీ బాదిన అభిషేక్ శర్మపై గౌతమ్ గంభీర్ ప్రసంసలు కురిపించాడు.
గంభీర్ పెర్ఫామెన్స్‌పై బీసీసీఐ రివ్యూ - 'అప్పటివరకే టైమ్- లేదంటే వేటు తప్పదు!'
ప్లేయర్స్‌కు BCCI నయా రూల్స్- ఇకపై అవన్నీ బంద్! గంభీర్ రచించిన పది సూత్రాలు ఇవే!