SA T20 Kaviya Maran:సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈస్టర్న్ కేప్ జట్టు డర్బన్ సూపర్ జెయింట్స్‌పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ 115 పరుగులకే పరిమితమైంది. ఇక సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం.
స్పెషల్ అట్రాక్షన్:ఈ మ్యాచ్‌కు హాజరైన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తమ జట్టు ప్లేయర్లు బౌండరీలు బాదుతుంటే కేరింతలు కొడుతూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసింది. అయితే ఐపీఎల్లో డల్‌గా కనిపించే కావ్య, సౌతాఫ్రికా లీగ్‌లో తమ జట్టు గెలుపును ఆస్వాదిస్తూ నవ్వుతుంటే ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి. ఇక ఎప్పుడూ మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉండే కావ్య ట్రోఫీ ప్రజెంటేషన్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ సంతోషాన్ని షేర్ చేసుకుంది. 'మాకు ఇది వరుసగా రెండో టైటిల్. చాలా హ్యాపీగా ఉంది. మా ప్లేయర్లు ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చారు. ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌ల్లో రాణించి ఈరోజు టైటిల్ సాధించారు. ఛాంపియన్‌గా నిలవడం సంతోషంగా ఉంది' అని కావ్యా మారన్ చెప్పింది.
Sun Risers Hyderabad 2024:ఇక ఐపీఎల్ విషయానికొస్తే, 2024 వేలంలో సన్‌రైజర్స్ భారీ కొనుగొళ్లు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర. ఇక రూ.6.80 కోట్లకు ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, రూ.1.50 కోట్లకు శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగను దక్కించుకుంది. ఇక దేశవాళీలో ఆకాశ్ సింగ్, జయదేవ్ ఉనాద్కత్, సుబ్రమణ్యన్‌లను కూడా తీసుకుంది.