Ruturaj Gaikwad Wife Challenge :చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఆటతీరుతో అభిమానులను అబ్బురపరుస్తాడు. ఓ వైపు సారథ్య బాధ్యతలు వహిస్తూనే మరోవైపు క్రికెటర్‌గానూ తన సత్తా చాటుతున్నాడు. 2021లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ క్రికెటర్, అప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ చెన్నై జట్టులో కీలక పాత్ర పోషించాడు. దాదాపు మూడేళ్ల పాటు అతడి ఆటతీరును గమనించిన ఫ్రాంచైజీ చెన్నై పగ్గాలను రుతురాజ్‌కు అందజేసింది. దీంతో ఇప్పుడు తన నయా రోల్లోనూ ఈ యంగ్ ప్లేయర్ అదరగొడుతున్నాడు.
ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ మంచి స్కోర్ సాధించి సత్తా చాటుతున్నాడు. నేడు (ఏప్రిల్ 19న) లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. అయితే ఈ స్టార్‌కు మరో స్టార్ క్రికెటర్ తాజాగా ఛాలెంజ్ విసిరారు. ఆమెవరో కాదు అతడి భార్య ఉత్కర్ష గైక్వాడ్.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సూపర్ కపుల్ పేరుతో ఓ వీడియెను అప్లోడ్ చేసింది. అందులో ఈ జంట బ్యాట్, బాల్ పట్టుకుని నెట్స్‌లోకి వస్తారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఓ క్యూట్ సంభాషణ జరిగింది.