Rules Used In IPL Not In T20s:టెస్టులు, వన్డేలకు ఆదరణ తగ్గుతున్న సమయంలో క్రికెట్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు టీ20 ఫార్మాట్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో లాంఛ్ అయిన ఐపీఎల్ ఏ రేంజ్ సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. విజయవంతంగా 17వ సీజన్ జరుపుకుంటున్న ఐపీఎల్‌ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ కొత్త కొత్త రూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తోంది. బ్యాటర్‌లకు, బౌలర్‌లకు సమాన అవకాశాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ రూల్స్ ఐసీసీ టీ20లకు వర్తించవు. ఐపీఎల్ అయిపోగానే టీ20 వరల్డ్‌కప్ మొదలు కానుండటంతో రూల్స్ మధ్య కన్ఫూజన్ లేకుండా ఉండేందుకే ఈ స్టోరీ.
ఇంపాక్ట్ ప్లేయర్:IPL 2023లోనే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చారు. ఈ సీజన్‌లో కూడా ఈ రూల్ కంటిన్యూ అవుతోంది. ఈ నియమం ప్రకారం, టీమ్‌లు 12వ ఆటగాడిని ప్లేయింగ్ 11లో ఉన్న ఇతర ఆటగాడితో రీప్లేస్ చేయవచ్చు. మ్యాచ్‌లో ఏ క్షణంలోనైనా ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.
రెండు బౌన్సర్‌లకు ఛాన్స్:ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 నుంచి ఒక ఓవర్‌లో బౌలర్ రెండు బౌన్సర్‌లు వేయవచ్చు. ఇంతకు ముందు ఒక బౌన్సర్‌కి మాత్రమే అవకాశం ఉండేది. అయితే ఈ రూల్ ఐపీఎల్‌కి మాత్రమే వర్తిస్తుంది, ఇంటర్నేషనల్ T20Iలలో ఒక బౌలర్ ఒక ఓవర్‌లో ఒక బౌన్సర్ మాత్రమే వేయాలి.
నో బాల్, వైడ్ బాల్ ఛాలెంజ్:ఐపీఎల్‌లో ఇకపై అంపైర్‌లు ఇచ్చిన నోబాల్, వైడ్ బాల్ కాల్స్‌ని బ్యాటింగ్ జట్లు ఛాలెండ్ చేయవచ్చు. DRS(డెసిషన్ రివ్యూ సిస్టమ్) కోరవచ్చు. ఇంటర్నేషనల్ టీ20లలో ఈ రూల్ ఇంకా ప్రవేశపెట్టలేదు.