తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ తరం కుర్రాళ్లు సూపర్- యంగ్​ ప్లేయర్లపై రోహిత్ స్పెషల్ పోస్ట్ - Sarfaraj Khan Test debut

Rohit Sharma Praise Youngsters: రాజ్​కోట్ టెస్టులో భారత్ విజయంలో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఈ యంగ్ ప్లేయర్ల ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రశంసించాడు.

Rohit Sharma Praise Youngsters
Rohit Sharma Praise Youngsters

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 4:44 PM IST

Updated : Feb 19, 2024, 5:08 PM IST

Rohit Sharma Praise Youngsters:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని యంగ్ ప్లేయర్లను ప్రోత్సహించండంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇంగ్లాండ్​పై భారత్ చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యంగ్ టాలెంటెడ్ స్టార్స్ యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్​, ధ్రువ్ జురెల్​ను రోహిత్ ప్రశంసించాడు. సోషల్ మీడియాలో వీరి ఫొటో ఒకటి షేర్ చేసి 'ఈ తరం పిల్లలు' అని క్యాప్షన్ రాసి, చప్పట్లు కొడుతున్న ఎమోజీని యాడ్ చేశాడు.

అయితే రాజ్​కోట్​ టెస్టులో జైశ్వాల్ అద్భుత ద్విశకతంతో భారత్​కు భారీ ఆధిక్యం కట్టబెట్టగా, అరంగేట్ర ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్​ కూడా ఆకట్టుకున్నారు. సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్​లోను 50+ స్కోర్ల్ నమోదు చేయగా, తొలి ఇన్నింగ్స్​లో జురెల్ 46 పరుగులతో రాణించాడు. ఇక అతడికి రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ, వికెట్ కీపింగ్ స్కిల్స్​తో జురెల్ అందర్నీ ఆకట్టుకున్నాడు. స్టంప్స్ వెనకాల ఉంటూ చురుగ్గా స్పందించాడు.

ఇక మ్యాచ్ అనంతరం జైశ్వాల్ గురించి రోహిత్ మాట్లాడాడు. 'నేను అతడి గురించి వైజాగ్ టెస్టులో కూడా చాలా చెప్పాను. ఇక అతడి గురించి ఎక్కువ మాట్లాడలేను. ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించాడు. ఫ్యూచర్​లోనూ ఇలాగే అద్భుతంగా ఆడాలని కోరుకుందాం' అని అన్నాడు. ఇదే టెస్టులో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్​ను కూడా రోహిత్ ప్రశంసించాడు.

రోహిత్ శర్మ ఇన్​స్టాగ్రామ్ స్టోరీ

ఈ మ్యాచ్​లో డబుల్ సెంచరీ బాదిన జైశ్వాల్ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్​పై టెస్టుల్లో రెండు ద్విశతకాలు సాధించిన తొలి భారత బ్యాటర్​గా రికార్డ్ కొట్టాడు. మరోవైపు ఇప్పటికే ఈ సిరీస్​లో రెండు డబుల్ సెంచరీలుసహా 545 పరుగులు సాధించిన జైశ్వాల్ టాప్ స్కోరర్​గా కొనసాగుతున్నాడు.

Ind vs Eng Test Series 2024:ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్​కు రాంచీ స్టేడియం వేదిక కానుంది. ఇక ఐదు మ్యాచ్​ల సిరీస్​లో భారత్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.

అదే మా బలం - వారికి కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్​

రాజ్​కోట్​లో భారత్ గ్రాండ్ విక్టరీ- 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు

Last Updated : Feb 19, 2024, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details