తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రెస్ట్ పేరు చెప్పి రోహిత్​ను కావాలనే తప్పించారు - ఏ కెప్టెన్ కూడా ఇలా చేయడు' - ROHIT SHARMA BORDER GAVASKAR TROPHY

రోహిత్ విషయంలో టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​ తీరు పట్ల మాజీలు ఫైర్ - ఏమంటున్నారంటే?

Rohit Sharma Border Gavaskar Trophy
Rohit Sharma (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 3, 2025, 11:08 AM IST

Rohit Sharma Border Gavaskar Trophy:సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడకపోవడం ఎంతో మందిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. తాజాగా క్రికెట్​లో జరిగిన ఈ కీలక పరిణామాలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆఖరి టెస్ట్​కు రోహిత్​కు బదులు జస్‌ప్రీత్ బుమ్రా సారథ్య బాధ్యతలు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. దీనికి తోడు టాస్ సమయంలో రోహితే రెస్ట్ తీసుకునేందుకు బెంచ్‌పై కూర్చున్నాడంటూ బుమ్రా తెలిపాడు. ఇప్పటికీ తమ కెప్టెన్‌ అతడేనని వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే రవిశాస్త్రి, సునీల్ గావస్కర్ లాంటి స్టార్స్ రోహిత్ ఇప్పటికే తన చివరి టెస్టును (మెల్‌బోర్న్‌ వేదికగా) ఆడేశాడంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రోహిత్‌కు విశ్రాంతి అని చెబుతున్నా అది తప్పించడమేనంటూ ఆసీస్‌ మాజీ క్రికెటర్ మార్క్‌ టేలర్ అన్నాడు. టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ తీరుపైన మండిపడ్డాడు.

"రోహిత్‌ను తప్పించారనే నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. కీలకమైన ఐదో టెస్టు టైమ్​లోనే కెప్టెన్‌ ఇలా విశ్రాంతి తీసుకోవాలనుకోవడం ఎక్కడా జరగదు. సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే టెస్టు మ్యాచ్ ఇది. అందుకే, తనను తప్పించారు. కానీ, టీమ్​ఇండియా మేనేజ్‌మెంట్ మాత్రం ఆ విషయాన్ని బయటకు చెప్పట్లేదు. అతడు శాశ్వతంగా టెస్టులు ఆడడని దాని అర్థం కాదు. ఇప్పుడు ఫామ్‌లో లేకపోవడంతో ఈ మ్యాచ్‌ను మిస్‌ అయ్యాడు. ఇటువంటివి ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో తప్పదు. కానీ, రోహిత్ విషయంలో ఇది దురదృష్టకరమే" అంటూ టేలర్ చెప్పుకొచ్చారు.

ఇదే తొలిసారేమో: గావస్కర్
ఇదిలా ఉండగా, రోహిత్​కు సపోర్ట్ చేస్తూ పలువురు భారత క్రికెటర్లు కూడా మాట్లాడుతున్నారు. తాజాగా దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ రోహిత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
"కీలకమైన టెస్టు మ్యాచ్‌లో జట్టు గెలుపు కోసం రోహిత్ ఇలా ఆలోచించాడు. తను కెప్టెనే కానీ ఒక్కోసారి సెలక్టర్, కోచ్‌, మేనేజర్‌గానూ తనవంతు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అతడి ఫామ్‌ దృష్ట్యా గిల్ తుది జట్టులో ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. సాధారణంగా ఇతర జట్లలో ఇది సాధారణమైన విషయమే. కానీ, భారత్‌ విషయానికొచ్చేసరికి ఇది కాస్త డిఫరెంట్​గా ఉంది. ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలి సారథి కూడా బహుశా రోహిత్‌ అయ్యుండొచ్చు. నేను కూడా కెప్టెన్​గా ఉన్నప్పుడు పరుగులు చేయడంలో చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు నా ఆర్డర్‌ను మార్చుకొన్నా. మళ్లీ ఫామ్‌ను అందుకొన్నా. రోహిత్ విషయంలో మనం ఇప్పటికే అతడి చివరి టెస్టును చూశామని అనుకుంటున్నా" అని గావస్కర్ వెల్లడించాడు.

సోషల్ మీడియాలో గంభీర్‌పై రోహిత్‌ ఫ్యాన్స్‌ ఫైర్
మరోవైపుసిడ్నీ టెస్టులో రోహిత్ ఆడకపోవడం వల్ల ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ను టార్గెట్‌ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ను పక్కనపెట్టడంపై రోహిత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదంతా గంభీర్‌ కావాలనే చేస్తున్నాడని జట్టును చీల్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు చేశారు.

'పారిపోవద్దు రోహిత్, ఫైట్ చెయ్'- హిట్​మ్యాన్​కు మాజీ క్రికెటర్ సూచన

కోచ్‌ Vs కెప్టెన్‌ - అందుకే రోహిత్ ప్లేస్​లో బుమ్రా - 'ఆ ఆలోచన అప్పుడే వచ్చిందా?!'

ABOUT THE AUTHOR

...view details