Rohit shama Preity Zinta:ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను మెగావేలంలో దక్కించుకోవడానికి ఎంత్తైనా ఖర్చు చేస్తానని పంజాబ్ కింగ్స్ ఓనర్ బాలీవుడ్ క్వీన్ ప్రీతీ జింటా చెప్పింది. హిట్‌మ్యాన్ కోసం లైఫ్‌ను బెట్‌గా వేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తమ జట్టుకు నిలకడగా రాణిస్తూ, ఛాంపియన్ మైండ్‌సెట్ ఉన్న ప్లేయర్ కావాలని ఆమె అభిప్రాయపడింది.
శనివారం రాజస్థాన్ చేతిలో పంజాబ్ ఓడిన తర్వాత ప్రీతీ ఈ మేరకు వ్యాఖ్యాలు చేసింది. 'రోహిత్ శర్మ 2025 మెగా వేలంలోకి అందుబాటులోకి వస్తే, అతడిని దక్కించుకోవడం కోసం నా లైఫ్‌ను బెట్‌గా వేస్తా. జట్టులో నిలకడతోపాటు ఛాంపియన్ మైండ్‌సెట్ కలిగిన కెప్టెన్‌ను మేం చాలా మిస్ అవుతున్నాం' అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడింది. దీంతో ప్రీతి 'పెద్ద ప్లానింగే వేసింది', 'బ్యూటీ విత్ బ్రెయిన్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Rohit Sharma Mumbai Indians: ఐపీఎల్లో రోహిత్ 2013లో తొలిసారి ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అదే ఏడాది ముంబయికి రోహిత్ తొలి టైటిల్ అందించాడు. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబయిని ఛాంపియన్‌గా నిలబెట్టి ఐపీఎల్ హిస్టరీలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్లో 158 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ 87 మ్యాచ్‌ల్లో నెగ్గాడు. ఈ లిస్ట్‌లో ధోనీ (133 విజయాలు) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 2024 సీజన్‌కుగాను ముంబయి ఫ్రాంచైజీ రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించి ఆ బాధ్యతలు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు అప్పగించింది. ఈ నిర్ణయం రోహిత్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దీన్ని వ్యతిరేకించారు. ఇక రోహిత్ మెగావేలంలోకి వస్తే, చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది.