తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెన్నిస్​ హిస్టరీలో బోపన్న రికార్డు - 43 ఏళ్ల వయసులో నంబర్​ వన్ ప్లేయర్​ - రోహన్​ బోపన్న ప్రపంచ రికార్డ్

Rohan Bopanna World Record : భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసులో డబుల్స్ విభాగంలో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ర్​గా నిలిచాడు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 1:11 PM IST

Updated : Jan 24, 2024, 2:44 PM IST

Rohan Bopanna World Record : భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోహన్ బోపన్న తాజాగా చరిత్ర సృష్టించాడు. టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో ఈ స్టార్​ ప్లేయర్ నంబర్​ వన్​ ర్యాంక్​కు చేరుకున్నాడు. 43 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన ఆయన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్ చేరడం వల్ల బోపన్న మొదటి ర్యాంకు చేరుకున్నాడు. దీంతో టెన్నిస్ చరిత్రలో అత్యధిక వయసులో నంబర్‌వన్ ర్యాంకు సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

ప్రపంచ నంబర్​వన్​ ర్యాంక్​ సాధించటంపై రోహన్​ బోపన్న స్పందించాడు. " నా 20 ఏళ్ల టెన్నిస్​ కేరీర్​లో నంబర్ వన్​ ర్యాంక్ సాధించటం ఆనందంగా ఉంది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భారత తరపు నుంచి మొదటి ర్యాంక్​లో నిలవటం గర్వకారణం. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. టీమ్ మొత్తానికి క్రెడిట్‌ వర్తిస్తుంది. కుటుంబం, కోచ్‌, ఫిజియో ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఇది భారత టెన్నిస్‌కు అత్యంత ముఖ్యమైనది. మరింత ఎక్కువమంది క్రీడాకారులు రావడానికి మార్గం చూపిస్తుందని భావిస్తున్నా" అని రోహన్​ వ్యాఖ్యానించాడు.

ఇక గేమ్​ విషయానికి వస్తే క్వార్టర్ ఫైనల్‌లో అర్జెంటీనా ద్వయం మాక్సిమో గొంజాలెజ్‌-ఆండ్రెస్‌ మోల్టేనిపై వరుస సెట్లలో 6-4, 7-5 తేడాతో రోహన్‌ బోపన్న జోడీ విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్​కు ముందు బోపన్న మూడో ర్యాంక్​లోఉన్నాడు. అయితే ఈ ర్యాంకుల జాబితా వచ్చే వారం విడుదల కానుంది. మరోవైపు తన డబుల్స్ పార్ట్‌నర్‌గా ఉన్న మాథ్యూ ఎబ్డెన్‌ ఈ లిస్ట్​లో రెండో ర్యాంక్​లో ఉన్నాడు.

అయితే గతంలో ఈ రికార్డ్ అమెరికాకు చెందిన రాజీన్​ రామ్​ పేరు మీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్​ను బోపన్న బ్రేక్​ చేసి నంబర్​వన్​ స్థానంలో ఉన్నాడు. రాజీవ్​ రామ్​ 38 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్​వన్​ ర్యాంక్​ను సాధించాడు. ఇక రోహన్​ బోపన్నకు 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో నంబర్ వన్ ర్యాంకు సాధించడం ఇదే తొలిసారి కావటం గమనార్హం. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన నాలుగో భారత టెన్నిస్ ప్లేయర్‌గా బోపన్న చరిత్రకెక్కాడు. బోపన్న కంటే ముందు నంబర్ వన్ ర్యాంకును లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా వరల్డ్ నంబర్​ వన్​గా నిలిచారు.

Last Updated : Jan 24, 2024, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details