తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మునుపటికి ఇప్పటికీ తేడా ఉంది - అతడు చాలా పరిణితి చెందాడు' - Virat Kohli Amit Mishra Issue - VIRAT KOHLI AMIT MISHRA ISSUE

Virat Kohli Amit Mishra Issue : మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ఇటీవలే స్టార్ ప్లేయర్ విరాట్​ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో అటు అభిమానులతో పాటు ఇటు స్టార్​ క్రికెటర్లు కూడా విరాట్​కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప దీనిపై స్పందించాడు.

Virat Kohli Amit Mishra Issue
Virat Kohli (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 9:58 AM IST

Virat Kohli Amit Mishra Issue: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కెరీర్​ తొలినాళ్లలో ఉన్నట్లు ఇప్పుడు కోహ్లీ ప్రవర్తించడం లేదంటూ మిశ్రా అన్నారు. అయితే ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ నేపథ్యంలో అభిమానులు, పలువురు క్రికెటర్లు మిశ్రా మాటలు తప్పుబట్టేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పటికే యువ క్రికెటర్ శశాంక్‌ సింగ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడగా, తాజాగా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా కోహ్లీ గురించి ప్రస్తావించాడు. అంతేకాకుండా విరాట్​పై ప్రశంసల వర్షం కురిపించాడు. కెరీర్‌ ఆరంభంతో పోలిస్తే విరాట్​ ఇప్పుడు చాలా పరిణితి చెందాడంటూ పేర్కొన్నాడు.

"దిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పచి నుంచి విరాట్‌ను నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అతడు ఎదుగుతున్న తీరు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. 15 ఏళ్ల కిందట విరాట్ నాటిన విత్తనమే (ఆట) ఇప్పుడు ఇటువంటి మంచి ఫలితాలను అందిస్తోంది. చీకూ (విరాట్‌) గురించి ఎప్పుడూ నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటి ఉంది. తనపై తాను అత్యంత ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకుంటాడు. ఈ విషయంలో మరెవరూ తన దరిదాపుల్లోకి రాలేరు. 19 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుటి నుంచి కూడా విరాట్‌ ఎప్పుడూ ఆట గురించే మాట్లాడుతుండేవాడు. ఒక్కోసారి అవి వింటుంటే 'అసలు ఏం మాట్లాడుతున్నాడు?' అని అనుకుంటాం. కానీ ఓ పదేళ్ల కాలం తర్వాత అవే సరైనవిగా అనిపిస్తాయి. 'అప్పుడు కోహ్లీ చెప్పిందిదే కదా' అని మనకు అనిపిస్తుంది. వ్యక్తిత్వంలోనే కాకుండా, ఆటలోనూ నిరంతరం మెరుగవుతూ అతడు పరిణితి సాధించడం అభినందనీయం". అంటూ రాబిన్ వెల్లడించాడు.

ఇక విరాట్ కెరీర్ విషయానికి వస్తే, టీ20 వరల్డ్​కప్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న కోహ్లీ రెండు వారాల కిందటే లండన్ పయనమయ్యాడు. ప్రస్తుతం అక్కడ తన ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య అనుష్కతో కలిసి లండన్ స్ట్రీట్స్​లో చక్కర్లు కొడుతున్నాడు. తాజాగా తన కుమారుడిని ఎత్తుకుని తీసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

క్రికెట్​లో 'విరాటే' కింగ్, మరి ధోనీ?- రైనా ఇంట్రెస్టింగ్ ఆన్సర్! - Suresh Raina MS Dhoni

'చిరు సాంగ్స్ అంటే విరాట్​కు చాలా ఇష్టం - ఆయన గురించి అడుగుతుంటాడు' - Virat Kohli Chiranjeevi Songs

ABOUT THE AUTHOR

...view details