Rishabh Pant Comeback IPL:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ కమ్‌బ్యాక్ గురించి దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాటింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. 2024 ఐపీఎల్ సహా, టీ20 వరల్డ్‌కప్ వరకు పూర్తిగా జట్టుకు అందుబాటులో ఉండే విధంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. ఏప్రిల్- మే లో జరిగే ఐపీఎల్లో పంత్ అన్ని మ్యాచ్‌లు అడేంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని పాంటింగ్ అన్నాడు.
'రాబోయే ఐపీఎల్లో ఆడడం పట్ల రిషభ్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అతడు ఎలా రికవరీ అవుతున్నాడో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మీరు చూస్తున్నారు. అయితే ఐపీఎల్‌కు ఆరు వారాల సమయం మాత్రమే ఉండడం వల్ల పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడా? లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ, నేను తన హెల్త్ కండీషన్ గురించి పంత్‌ను అడిగితే 'నేను ప్రతీ మ్యాచ్ ఆడతా. నెం.4లో బ్యాటింగ్‌కు దిగడమే సీజన్ మొత్తం నేనే కీపింగ్ చేస్తా' అని కచ్చితంగా చెప్తాడన్న నమ్మకం ఉంది. అతడు మంచి ప్లేయర్. మా కెప్టెన్ కూడా. గతేడాదే అతడిని చాలా మిస్ అయ్యాం. ఈసారి 14 మ్యాచ్‌ల్లో కాకపోయినా కనీసం 10 గేమ్స్ ఆడేలా చూస్తాం. పంత్ కాకపోతే డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా కొనసాగుతాడు' అని పాంటింగ్ అన్నాడు.
దిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్‌లో కీలక మార్పులు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఫిల్ సాల్ట్, వెస్టిండీస్ ప్లేయర్ రోమన్ పావెల్‌ను వదులుకుంది. రీసెంట్గా జరిగిన వేలంలో యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార కుషాగ్రా, షయ్ హోప్‌ను కొనుగోలు చేసింది.