Rishabh Pant BCCI IPL 2024 :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరలో జరగబోయే ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మేరకు పంత్ ప్రమాద గాయాల నుంచి కోలుకున్నాడని, ఐపీఎల్ కోసం ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ప్రకటించింది. '14 నెలల రిహబిలిటేషన్, రికవరీ ప్రక్రియ తర్వాత రిషభ్ పంత్, రాబోయే ఐపీఎల్ 2024 కోసం వికెట్ కీపర్, బ్యాటర్‌గా ఫిట్‌గా ఉన్నాడు' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, ప్రసిధ్ కృష్ణలు ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యారని బీసీసీఐ వెల్లడించింది.
అయితే 2022 డిసెంబరు చివరిలో టీమ్‌ఇండియా రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు దాదాపు 14 నెలలపాటు మైదానానికి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న అతడు ఈసారి ఐపీఎల్‌లో బరిలోకి దిగుతాడా? లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉండేవి. కానీ, వాటన్నింటికి ముగింపు పలుకుతూ బీసీసీఐ తాజా ప్రకటన విడుదల చేసింది. పంత్ త్వరలోనే దిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరనున్నాడు.
షమీ, ప్రసిధ్ కృష్ణ దూరం
Shami Prasidh Krishna IPL 2024 : మరోవైపు ఎడమ కాలి మోకాలుకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ప్రసిద్ధ్ కృష్ణ, ఫిబ్రవరి 26న కుడికాలి చీలమండకు సర్జరీ చేయించుకున్న రికవరీ అవుతున్న మహ్మద్ షమి ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ జట్టులో షమీ కీలక ఆటగాడు. గత సీజన్‌లో గుజరాత్ ఫైనల్‌కు చేరడంలో ఈ బౌలర్ కీలక పాత్ర పోషించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్నాడు. అయితే ప్రసిధ్ లోటును ఇటీవల ట్రేడ్ చేస్తుకున్న అవేశ్ ఖాన్‌తో రాజస్థాన్ రాయల్స్ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక గుజరాత్లో షమీ స్థానంలో ఎవరిని తీసుకుంటారో తెలియాల్సి ఉంది. కాగా, ఈనెల 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడనుంది.
టీ20 వరల్డ్‌కప్‌పై ఆసీస్ కన్ను- టీమ్‌లో మార్పులు! కొత్త కెప్టెన్‌గా మిచెల్ మార్ష్?
'హార్దిక్ లేకుండానే గుజరాత్ స్ట్రాంగ్‌గా ఉంది'- పాండ్యపై ఆసీస్ మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు