ICC Ranking 2024 :అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం తాజా టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ మూడు స్థానాలు ఎగబాకి విరాట్ కోహ్లీనీ అధిగమించాడు. ప్రస్తుతం పంత్ 745 రేటింగ్స్‌తో ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు విరాట్ (720 రేటింగ్స్) ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (780 రేటింగ్స్)నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (917 రేటింగ్స్) అగ్రస్థానంలోనే ఉన్నాడు. కాగా, టాప్ 10లో ముగ్గురు భారత బ్యాటర్లు ఉన్నారు.
టాప్ 5 బ్యాటర్లు
- జో రూట్ (ఇంగ్లాండ్)- 917 రేటింగ్స్
- కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 821 రేటింగ్స్
- హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)- 803 రేటింగ్స్
- యశస్వీ జైస్వాల్ (భారత్)- 780 రేటింగ్స్
- స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 757 రేటింగ్స్
ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 15వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు భారత్‌తో తొలి టెస్టులో భారీ శతకంతో అదరగొట్టిన రచిన్ రవీంద్ర తాజా ర్యాకింగ్స్లో ఏకంగా 36 స్థానాలు ఎగబాకాడు. 681 రేటింగ్స్‌తో రచిన్ ప్రస్తుతం 18వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక పాకిస్థాన్ ప్లేయర్ సలమ్ అఘా ఎనిమిది స్థానాలు మెరుగుర్చపకున్నాడు. సలమ్ అఘా ప్రస్తుతం 684 రేటింగ్స్‌తో 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.