తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బుమ్రా బెంజ్ కారు కాదు, టిప్పర్ లారీ!' - కోహ్లీతో పోలికపై అశ్విన్ కామెంట్స్ - Ravichandran Ashwin About Bumrah - RAVICHANDRAN ASHWIN ABOUT BUMRAH

IND VS BAN Ravichandran Ashwin On Bumrah Fitness : బుమ్రా తన ఫిట్​నెస్​పై చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. దీనిపై బాగా విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ విమర్శలపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.

source IANS and ANI
Bumrah Ashwin (source IANS and ANI)

By ETV Bharat Sports Team

Published : Sep 24, 2024, 10:29 AM IST

Updated : Sep 24, 2024, 10:40 AM IST

IND VS BAN Ravichandran Ashwin On Bumrah Fitness : బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో టీమ్​ ఇండియా భారీ విజయం సాధించింది. చెపాక్​ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో లోకల్​ బాయ్ రవి చంద్రన్ అశ్విన్‌ దెబ్బకు కుదేలైంది. స్టార్‌ పేసర్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా బౌలింగ్‌లో అదిరే ప్రదర్శన చేశారు. అసలు బుమ్రా పేస్‌ను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు కష్టమైంది.

అయితే రీసెంట్​గా ఓ ఇంటర్య్వూలో బుమ్రా తన ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అందరికన్నా తానే అత్యుత్తమ బెస్ట్​ ఫిట్‌నెస్​ను కలిగి ఉన్నట్లు తెలిపాడు. అయితే ఈ కామెంట్స్​పై మిక్స్​డ్​ రియాక్షన్స్ వస్తున్నాయి.

తాజాగా దీనిపై రవి చంద్రన్ అశ్విన్‌ రియాక్ట్ అయ్యాడు. భారత క్రికెట్‌కు రత్న కిరీటం లాంటోడని బుమ్రాను ప్రశంసించాడు. బుమ్రాపై విమర్శలు చేసినవారికి కాస్త చురకలు కూడా అంటించాడు.

" బుమ్రా సూపర్‌ ఫాస్ట్‌ బౌలర్. గంటకు 145 కి.మీ. వేగంతో బంతులను సంధించగలడు. భారత క్రికెట్‌కు అతడు రత్న కిరీటం. కోహీనూర్‌ డైమండ్‌ అని ఇప్పటికే చెప్పాను. అతడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడో దానిని చెప్పనీవండి. కపిల్‌ దేవ్‌ తర్వాత బుమ్రా కన్నా ఇంకెవరైనా స్టార్‌ పేసర్ ఉన్నారా? ఇతర క్రికెటర్లను తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేయట్లేదు. 'బుమ్రా గాయాల బారిన పడుతూ ఉంటాడు. మరి అలాంటి క్రికెటర్‌ అత్యుత్తమ ఫిట్‌నెస్‌ కలిగిన క్రికెటర్ అని ఎలా చెబుతాడు?' అని చాలా మంది అడిగారు. కానీ, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు, ఒక టిప్పర్‌ లారీ, ఒక మెర్సిడెస్ బెంజ్ ఉన్నాయి. బెంజ్‌ కార్‌ను చాలా జాగ్రత్తగా నడుపుతుంటాం. ఆ కారు డ్రైవర్​ డ్రైవింగ్ అలా ఉంటుంది. అయితే టిప్పర్ లారీ దేశం మొత్తం తిరుగుతుంటుంది. భారీ లోడ్‌ను కూడా మోసుకెళ్తుంది. ఫాస్ట్‌ బౌలర్‌ కూడా టిప్పర్‌ లారీ లాండివాడే. ఒక్కోసారి బ్రేక్‌ డౌన్‌ అవుతుంది. అలానే బుమ్రా కూడా గాయాల నుంచి కోలుకొని వచ్చి 145 కి.మీ. వేగంతో బౌలింగ్‌ సంధిస్తుంటాడు. కాబట్టి, ఫిట్‌నెస్‌ క్రెడిట్‌ అతడికి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

అసలు ఏం జరిగిందంటే? - రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో బుమ్రా తన ఫిట్​నెస్​పై మాట్లాడాడు. ఎవరు అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉంటారు? అని అడగగా చాలా మంది భారత స్టార్‌ కోహ్లీ పేరు చెబుతాడని అంతా అనుకున్నారు. కానీ, బుమ్రా తన పేరే చెప్పుకున్నాడు. తానే అత్యుత్తమ ఫిట్‌నెస్‌ కలిగిన ప్లేయర్‌ అని సమాధానమిచ్చాడు.

"ఎందుకంటే నేను ఫాస్ట్‌ బౌలర్‌. క్లిష్టపరిస్థితుల్లో పేసర్‌గా రాణంచాలంటే చాలా అంశాల్లో మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఫిట్‌నెస్‌ కూడా అంతే కీలకం. అందుకే నేను ఓ ఫాస్ట్‌ బౌలర్‌గా ఎంతో ఫిట్‌గా ఉంటాను" అని బుమ్రా చెప్పాడు.

చెస్ ఒలింపియాడ్​ గోల్డ్ మెడలిస్ట్​లకు ఘన స్వాగతం - ప్రజ్ఞానంద ఏమంటున్నాడంటే? - Chess Olympiad 2024

ధోనీ కెప్టెన్సీకి అసలైన నిర్వచనం ఈ అద్భుత విజయం - 2007 T20 world cup

Last Updated : Sep 24, 2024, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details