Ranji Trophy 2023-24 Tanmay Agarwal : రంజీ ట్రోఫీ 2023 - 24 సీజన్లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.
టీ20 మ్యాచ్ స్టైల్లో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ మొదటి రోజు ఆట ముగిసే సరికి 160 బంతుల్లో 323 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి.
ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ : ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిసిన తన్మయ్ అగర్వాల్ సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో బోర్డర్ జట్టు తరఫున ఆడిన మార్కో - ఈస్టర్న్ ప్రావిన్స్‌పై 191 బంతుల్లో 300 పరుగులు చేశాడు. తన్మయ్ 147 బంతుల్లో ఈ మార్క్‌ను అందుకోవడం విశేషం.
రవిశాస్త్రి రికార్డ్ కూడా బ్రేక్ : ఈ మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ద్విశతకం బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో 39 ఏళ్లుగా టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్ అయింది. 119 బంతుల్లోనే 200 పరుగుల మార్క్‌ను అందుకుని ఈ ఘనత సాధించాడు తన్మయ్.
Hyderabad Vs Arunachal Pradesh Ranji Trophy : ఇకపోతే ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను 172 పరుగులకే కట్టడి చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, కార్తికేయ మూడేసి వికెట్లు పడగొట్టగా టి.త్యాగరాజన్ 2, సాకేత్, ఇల్లిగరం సంకేత్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ మొదటి రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 48 ఓవర్లలోనే 529 పరుగులు చేసింది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై 357 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో తన్మయ్‌కు తోడుగా అభిరథ్ రెడ్డి 19 పరుగులతో కొనసాగుతున్నాడు.
'3 ఏళ్లుగా సానియాను చీట్ చేస్తున్న షోయబ్- ఎక్కడికి పిలిచినా సనా వెంట ఉండాల్సిందే!'