తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ గ్రేడ్ A ప్లేయర్ - ఆ ఘనత సాధించిన 11వ ఆల్​రౌండర్! - అశ్విన్ నెట్​వర్త్​ గురించి తెలుసా? - R ASHWIN NETWORTH

బీసీసీఐ గ్రేడ్ A ప్లేయర్ - ఆ ఘనత సాధించిన 11వ ఆల్​రౌండర్! - అశ్విన్ కళ్లు చెదిరే నెట్​వర్త్​ గురించి తెలుసా?

Ashwin
Ashwin (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Dec 18, 2024, 6:10 PM IST

R Ashwin Networth And BCCI Income Details : గబ్బా వేదికగా తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు ముగిసిన తర్వాత టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికేందుకు ఈ క్షణాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు.

ఇక అశ్విన్ తన టెస్ట్ క్రికెట్‌లో ఎన్నో మైల్​స్టోన్స్​ను దాటాడు. టీమ్ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాకుండా ఆడిన 106 టెస్ట్ మ్యాచ్‌లలో 537 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఈ తరంలో అత్యంత ప్రసిద్ధ స్పిన్నర్‌లలో ఒకడిగా నిలిచాడు.

ఓ బౌలర్​గానే కాకుండా ఓ బ్యాటర్​గానూ అశ్విన్ జట్టుకు కీలక పరుగులు అందించాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడు 3,503 పరుగులు చేయగా, అందులో ఆరు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. వీటితో పాటు 3,000 పరుగులు అలాగే 300 వికెట్లు దాటిన 11 మంది ఆల్​రౌండర్లలో ఒకడిగా నిలిచాడు అశ్విన్. అయితే అశ్విన్​ తన కెరీర్​ను గ్రేడ్​ A ప్లేయర్​గా ముగించనున్నాడు. 2023-2024 సీజన్‌కుగానూ, అశ్విన్‌ను బీసీసీఐ గ్రేడ్ A ప్లేయర్​గా పరిగణించి అతడికి రూ. 5 కోట్ల వార్షిక వేతనాన్ని ఇచ్చింది. అంతకముందు అతడు ఎంత రెమ్యూనరేషన్ అందుకునేవాడంటే?

  1. 2008 గ్రేడ్ డి - రూ. 15 లక్షలు
  2. 2009 గ్రేడ్ డి - రూ. 15 లక్షలు
  3. 2010 గ్రేడ్ సి - రూ. 25 లక్షలు
  4. 2011 గ్రేడ్ బి - రూ. 50 లక్షలు
  5. 2012 గ్రేడ్ ఏ- రూ.1 కోటి
  6. 2013 గ్రేడ్ ఏ రూ.1 కోటి
  7. 2014 గ్రేడ్ ఏ రూ.1 కోటి
  8. 2015 గ్రేడ్ ఏ రూ.1 కోటి
  9. 2016 గ్రేడ్ ఏ రూ.1 కోటి
  10. 2017 గ్రేడ్ ఏ రూ.5 కోట్లు
  11. 2018 గ్రేడ్ ఏ రూ.5 కోట్లు
  12. 2019 గ్రేడ్ ఏ రూ.5 కోట్లు
  13. 2020 గ్రేడ్ ఏ రూ.5 కోట్లు
  14. 2021 గ్రేడ్ ఏ రూ.5 కోట్లు
  15. 2022 గ్రేడ్ ఏ రూ.5 కోట్లు
  16. 2023 గ్రేడ్ ఏ రూ.5 కోట్లు
  17. 2024 గ్రేడ్ ఏ రూ.5 కోట్లు

రవిచంద్రన్ అశ్విన్ నెట్ వర్త్
ప్రముఖ స్పోర్ట్స్​ వెబ్​నైట్​ ప్రకారం 2024 నాటికి అశ్విన్ నెట్​వర్త్​ సుమారు రూ. 132 కోట్లు (దాదాపు $16 మిలియన్లు) ఉన్నట్లు అంచనా. ఇందులో తన క్రికెట్ ఆదాయంతో పాటు, పలు ప్రధాన బ్రాండ్‌లకు యాడ్స్ అలాగే ఎండార్స్‌మెంట్లు చేసిన

ABOUT THE AUTHOR

...view details