ETV Bharat / sports

మను భాకర్ ఇంట విషాదం- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుటుంబ సభ్యులు మృతి - MANU BHAKER GRAND MOTHER DIED

మను భాకర్ ఇంట విషాదం - బైక్​ను ఢీ కొట్టిన కారు - ప్రమాదంలో ఫ్యామిలీ మెంబర్స్​ మృతి

MANU BHAKER FAMILY
Manu Bhaker (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 19, 2025, 1:16 PM IST

Manu Bhaker Grand Mother Died : భారత స్టార్ షూటర్ మను భాకర్ ఇంట విషాదం నెలకొంది. హరియాణాలోని చర్​ఖీ దాదరీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె అమ్మమ్మ అలాగే మేనమామ దుర్మరణం పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వారు వెళ్తున్న బైక్​ను ఓ కారు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కారు నడిపిన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఇదీ జరిగింది :
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చర్​ఖీ దాదరీలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో మను భాకర్ మామయ్య, అమ్మమ్మ స్కూటర్‌పై వెళ్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక వాహనం వాళ్ల స్కూటర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. తదుపరి విచారణ చేపడుతున్నారు.

ఇంతలోనే ఇలా!
రెండు రోజుల క్రితమే మను భాకర్​ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదగా ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డు అందుకుంది. ఇంతలోనే ఈ ఘటన జరగడం బాధకు గురిచేస్తోందని మను అభిమానులు అంటున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. బీ స్ట్రాంగ్ మను అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

2024 పారిస్​ ఒలింపిక్స్​లో మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల మిక్స్​డ్​ డబుల్స్​లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్​లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 1900 ఒలింపిక్స్​లో నార్మన్ ప్రిచర్డ్‌ రెండు రజతాలను గెలిచారు. ఇప్పుడు నార్మన్‌ తర్వాత రెండు పతకాలను సాధించిన అథ్లెట్​గా బాకర్‌ నిలిచింది. 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో మరో కాంస్య పతకాన్ని కోల్పోయింది మను బాకర్. లేకపోతే మూడు పతకాలు సాధించిన ఏకైక భారత్ క్రీడాకారిణిగా అవతరించేది.

మను బాకర్‌కు దక్కని చోటు - 'ఖేల్‌ రత్న' నామినేషన్లపై మొదలైన వివాదం!

ఒలింపిక్స్‌ పిస్టల్ ధర రూ.కోటి! - మను బాకర్ రియాక్షన్ ఇదే - Manu Bhaker Reacted on PIstol Price

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.