PV Sindhu Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌పై అలవోకగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రజాక్, సింధుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు ఆటలో పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ, 21-9, 21-6 తేడాతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. దీంతో ఈ మ్యాచ్ కేవలం 29 నిమిషాల్లోనే ముగిసింది.
ఈజీ విన్
తొలి సెట్‌ను కేవలం 13 నిమిషాల్లో ముగించిన సింధు, రెండో గేమ్ లోనూ అదే దూకుడును చూపించింది. రెప్పపాటు వ్యవధిలోనే తొలి నాలుగు పాయింట్లను చేజిక్కించుకుంది. ఆ తర్వాత రజాక్ పుంజుకోవడం వల్ల పాయింట్ల మధ్య వ్యత్యాసం తగ్గింది. ఆ తర్వాత సింధు మరోసారి పుంజుకుని 10-3కి గ్యాప్ ను పెంచింది. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా మారి 21-6 తేడాతో గెలుపొందింది. ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలను ఖాతాలో వేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మూడో మెడల్ పై కన్నేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో మూడో ఒలింపిక్ పతకాన్ని గెలవాలని కసిగా రాణిస్తోంది.
ఒలింపిక్ విజేతతో సింధు ఢీ
2016 రియో ఒలింపిక్స్ లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత క్రిస్టినా కూబాతో గ్రూప్ స్టేజ్ లో బుధవారం పీవీ సింధు తలపడనుంది. క్రిస్టినా కూబా ఎస్టోనియాకు చెందిన క్రీడాకారిణి. ఈ మ్యాచ్ లో విజయం పీవీ సింధు విజయం సాధిస్తే ఒలింపిక్ మెడల్ సాధించడంలో మరో అడుగు ముందుకు పడినట్లే.