తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా బౌలింగ్​లో సిక్స్ కొట్టిన ప్లేయర్లు- ​8570 బంతుల్లో 9 సార్లే! - SIXES IN BUMRAH BOWLING TEST

బుమ్రా బౌలింగ్​లోనూ సిక్స్​లు బాదిన బ్యాటర్లు ఎవరో తెలుసా?

Sixes In Bumrah Bowling
Sixes In Bumrah Bowling (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Dec 30, 2024, 5:31 PM IST

Sixes In Bumrah Bowling Test :టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్​ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అతడు సంధించే యార్కర్లకు వికెట్ కోల్పోకుండా చాలా మంది బ్యాటర్లు జాగ్రత్త పడుతుంటారు. అంతలా ఇటీవల కాలంలో బుమ్రా తన బౌలింగ్​తో విజృంభిస్తున్నాడు. అయితే బాక్సింగ్ డే టెస్టులో 19ఏళ్ల ఆసీస్ కుర్రాడు బుమ్రా బౌలింగ్​లో సిక్స్​ బాది అందర్నీ ఆశ్చర్యపర్చాడు.

టెస్టు ఫార్మాట్​లో దాదాపు 4483 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్​లో సిక్స్ రావడం అదే తొలిసారి కావడం గమనార్హం. అయితే తన 6ఏళ్ల టెస్టు కెరీర్​లో బుమ్రా ఇప్పటివరకు 44 మ్యాచ్​ల్లో 8570 బంతులు సంధించాడు. అందుకే కేవలం తొమ్మిదిసార్లే బంతి స్టాండ్స్​లోకి వెళ్లింది. మరి సింగిల్ తీయడమే కష్టంగా ఉండే బుమ్రా బౌలింగ్​లో సిక్స్​లు బాదింది ఎవరు? ఎప్పుడు బాదారో తెలుసుకుందాం!​

  • టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్​లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఆదిల్ రషీద్ 2018లో సిక్సర్ బాదాడు. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన టెస్టులో బుమ్రా బౌలింగ్​లో సిక్సర్ కొట్టాడు.
  • సౌంతాప్టన్ వేదికగా 2018లో జరిగిన టెస్టు మ్యాచ్​లో ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ మొయిన్ అలీ బుమ్రా ఓవర్​లో సిక్సర్ బాదాడు.
  • 2018లో ది ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో బుమ్రా బౌలింగ్​లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ రెండు సిక్సర్లు కొట్టాడు.
  • 2018లో కేప్ టౌన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో బుమ్రా బౌలింగ్​లో సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీయర్స్ సిక్స్ కొట్టాడు.
  • మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్​లో 2020 జరిగిన మ్యాచ్​లో ఆసీస్ ఆటగాడు నాథన్ లియాన్ కూడా బుమ్రా బౌలింగ్​లో సిక్సర్ బాదాడు.
  • 2021లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​లో బుమ్రా బౌలింగ్​లో ఆసీస్ ఆటగాడు కెమెరాన్ గ్రీన్ సిక్స్ కొట్టాడు.
  • అలాగే తాజాగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ కాన్ స్టాస్ అదరగొట్టాడు. బుమ్రా బౌలింగ్​లో సిక్సర్ బాదాడు. దీంతో బుమ్రా బౌలింగ్​లో మూడేళ్ల తర్వాత సిక్సర్ నమోదైంది.

అదరగొడుతున్న బుమ్రా
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో బుమ్రా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ ల్లో 30 వికెట్లు తీసి ఈ సిరీస్​లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్​గా కొనసాగుతున్నాడు. ఇక 2024లో మొత్తం 13 టెస్టుల్లో బుమ్రా 71 వికెట్లు పడగొట్టాడు.

బుమ్రా@ 200- తొలి భారత బౌలర్​గా రికార్డ్- కెరీర్​లో మరో ఘనత

'కమాన్, ఇప్పుడు అరవండి రా!'- కొన్​స్టాస్​ను క్లీన్​ బౌల్డ్ చేసిన బుమ్రా సంబరాలు

ABOUT THE AUTHOR

...view details