తెలంగాణ

telangana

ETV Bharat / sports

పారిస్​లో మళ్లీ పండగ షురూ - 168 దేశాలు, 4400 మంది అథ్లెట్లతో! - Paris Paralympics 2024 - PARIS PARALYMPICS 2024

Paris Paralympics 2024 : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ఇటీవలే ముగిసింది. ఇప్పుడు ఇదే వేదికగా మరో క్రీడోత్సవం పారాలింపిక్స్​ షురూ! నేటి(ఆగస్ట్​ 28) నుంచే ఈ పారాలింపిక్స్‌ ప్రారంభం. దివ్యాంగుల కోసం జరగబోయే క్రీడలు ఇవి. ఈ క్రీడల్లో 168 దేశాల నుంచి 4400 మంది అథ్లెట్లు బరిలోకి దిగబోతున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source Associated Press
Paris Paralympics 2024 (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Aug 28, 2024, 7:24 AM IST

Paris Paralympics 2024 : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ఇటీవలే ముగిసింది. ఇప్పుడు ఇదే వేదికగా మరో క్రీడోత్సవం పారాలింపిక్స్​ షురూ! నేటి(ఆగస్ట్​ 28) నుంచే ఈ పారాలింపిక్స్‌ ప్రారంభం. దివ్యాంగుల కోసం జరగబోయే క్రీడలు ఇవి. ఈ క్రీడల్లో 168 దేశాల నుంచి 4400 మంది అథ్లెట్లు బరిలోకి దిగబోతున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో.

  • పారిస్‌ ఒలింపిక్స్‌లో 3×3 బాస్కెట్‌బాల్‌, బ్రేక్‌ డ్యాన్స్, స్కేట్‌ బోర్డింగ్ నిర్వహించిన డిలా కాంకార్డ్‌ వేదికగా ఈ పారాలింపిక్స్‌ ప్రారంభోత్సవం జరగనుంది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే స్టేడియంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో ఇలా ప్రారంభోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్‌ 8న ముగింపోత్సవం జరుగుతుంది.
  • మహిళలకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ సారి 10 కొత్త ఈవెంట్లను(2020 టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే) తీసుకొచ్చారు. వీటిలో గోల్‌బాల్, బోచా ఆటలు ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
  • ఈ పారిస్​ పారాలింపిక్స్​లో చైనా(282) తరఫున అత్యధికంగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో చైనా 96 గోల్డ్​ మెడల్స్​, ఓవరాల్​గా 207 పతకాలు సాధించింది.
  • భారత్​ తరఫున ఎంతమందంటే?(Paris Paralympics India) - ఈ పారిస్ పారాలింపిక్స్​లో భారత్‌ తరఫున 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. తైక్వాండో, స్విమ్మింగ్‌ (1), సైక్లింగ్, జూడో, టేబుల్‌ టెన్నిస్, రోయింగ్‌ (2), పారా కనోయింగ్‌ (3), పవర్‌లిఫ్టింగ్‌ (4), ఆర్చరీ (6), షూటింగ్‌ (10), బ్యాడ్మింటన్‌ (13), అథ్లెటిక్స్​(38) పోటీ పడుతున్నారు.
  • 25 మెడల్స్​ లక్ష్యంగా - అంధుల జూడో, రోయింగ్, సైక్లింగ్ భారత్‌ తొలి సారి అథ్లెట్లను బరిలోకి దింపింది. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ 5 గోల్డ్ మెడల్స్​ సహా 19 పతకాలను దక్కించుకుంది. ఈ సారి పారిస్ పారాలింపిక్స్​లో 25 మెడల్స్​ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆరంభోత్సవ వేడుకలో సుమిత్‌ అంటిల్‌ (అథ్లెటిక్స్‌), భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరిస్తారు.
  • తెలుగు రాష్ట్రాల నుంచి - ఇక రొంగలి రవి (షాట్‌పుట్‌, అనకాపల్లి), కొంగనపల్లి నారాయణ (రోయింగ్, నంద్యాల), జీవాంజి దీప్తి (400 మీటర్ల టీ20 పరుగు, వరంగల్‌), షేక్‌ అర్షద్‌ ( తైక్వాండో, నంద్యాల) తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొంటున్నారు.
  • మెడల్ ఛాన్సెస్​ - అథ్లెట్‌ దీప్తి గోల్డ్​ మెడల్​ గెలిచే అవకాశాలున్నాయి. ఇక టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్​, సిల్వర్​ మెడల్ సాధించిన షూటర్‌ అవని లేఖరాపై(10 మీటర్ల ఎయిర్‌రైఫిల్, 10 మీటర్ల మిక్స్‌డ్‌ ఎయిర్‌ రైఫిల్‌) కూడా మంచి అంచనాలున్నాయి. కృష్ణ నగార్‌ (బ్యాడ్మింటన్‌), సుహాస్‌ యతిరాజ్‌ (బ్యాడ్మింటన్‌), సుమిత్‌ అంటిల్‌ (జావెలిన్‌త్రో, ఎఫ్‌-64), శీతల్‌దేవి (ఆర్చరీ), భవీనా పటేల్‌ (టేబుల్‌టెన్నిస్‌), తంగవేలు మరియప్పన్‌ (హైజంప్‌), యోగేశ్‌ కతూనియా (డిస్కస్‌త్రో), మనీశ్‌ నర్వాల్‌ (షూటింగ్‌) మెడల్స్ సాధించే అవకాశాలున్నాయి.

మరిన్ని విశేషాలు -

  • వాలెంటీనా పెట్రిలో (ఇటలీ, అథ్లెటిక్స్‌) - ఈ క్రీడల్లో పాల్గొంటున్న తొలి ట్రాన్స్‌జెండర్‌.
  • షార్క్‌ దాడిలో కాలు పోగొట్టుకున్న అమెరికా స్విమ్మర్​ అలీ ట్రువిట్‌పై అంచనాలు ఉన్నాయి.
  • పారాలింపిక్స్‌లో 7 గోల్డ్ మెడల్స్​ సహా 17 మెడల్స్​ సాధించింది అమెరికా స్టార్‌ ఒక్సానా మాస్టర్స్‌ (సైక్లింగ్‌). ఈసారి కూడా ఒక్సానా మాస్టర్స్​ మెరుగైన ప్రదర్శన చేస్తుందని అంచనాలు ఉన్నాయి.
  • షరిఫ్‌ ఉస్మాన్‌ (ఈజిప్ట్, పవర్‌ లిఫ్టింగ్‌) నాలుగో, బేబ్‌వివో (ఇటలీ, ఫెన్సింగ్‌) మూడో గోల్డ్ మెడల్​పై దృష్టి పెట్టారు.
  • 16 ఏళ్ల చెక్‌ అమ్మాయి డేవిడ్‌ క్రటోచ్‌విల్‌ 50 మీటర్లు, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఆమె ఇప్పుడు గోల్డ్​ మెడల్ సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు గతంలో ఆమె ఐస్‌ హాకీ ప్లేయర్‌.
  • 2004 ఏథెన్స్‌ పారాలింపిక్స్‌ నుంచి అంధుల సాకర్‌ క్రీడలో బ్రెజిల్ దేశమే​ గోల్డ్ మెడల్ సాధిస్తూ వస్తోంది. ఈసారి కూడా ఆ దేశమే ఫేవరెట్‌గా ఉంది.
  • పారిస్‌ ఒలింపిక్స్​లో రష్యా, ఉక్రెయిన్‌ అథ్లెట్లు తటస్థ జెండాతో పోటీపడ్డారు. ఇప్పుడు పారాలింపిక్స్‌లోనూ రష్యా, ఉక్రెయిన్‌ అథ్లెట్లు తటస్థ జెండాతోనే పోటీ పడనున్నారు. రష్యా తరఫున 88, ఉక్రెయిన్‌ నుంచి 8 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.
  • గతంలో 2012, 2020 పారాలింపిక్స్​లో 164 దేశాలు పాల్గొన్నాయి. ఈ సారి ఆ రికార్డ్​ బ్రేక్ అయింది. అత్యధికంగా పారిస్ పారాలింపిక్స్​లో 168 దేశాలు బరిలోకి దిగబోతున్నాయి.
  • ఈ పారిస్​ పారాలింపిక్స్​లో చైనా తరఫున 282 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ పారిస్​ పారాలింపిక్స్​లో అత్యధిక సంఖ్య ఇదే. వీరిలో పరుషులు 124 మంది కాగా, మహిళలు 158 మంది ఉన్నారు. చైనా తర్వాత బ్రెజిల్‌ 255 మంది అథ్లెట్లతో రెండో స్థానంలో ఉంది.
  • ఈ పారిస్ పారాలింపిక్స్​లో మొత్తం 4440 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. వీరిలో 164 పతక ఈవెంట్లలో 1135 అథ్లెటిక్స్​ బరిలో దిగారు.
  • ఈ సారి పారిస్​ పారాలింపిక్స్‌లో పోటీ పడే శరణార్థ అథ్లెట్లు 8 మంది ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details