Paris Olympics Viacom 18 :పారిస్ ఒలింపిక్స్ క్రీడల ద్వారా ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ వయాకామ్ 18 ఓ అరుదైన రికార్డును సృష్టించింది. మొత్తం 17 కోట్ల వ్యూస్ వచ్చినట్లు తాజాగా విడుదలైన గణాంకాల్లో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంటే వ్యూవర్స్ ఈ క్రీడలనుచూసిన సమయం 1500 కోట్ల నిమిషాలు దాటిపోయిందని అందులో పేర్కొందని, వయాకామ్ డిజిటల్ సీఈవో కిరణ్ మణి వెల్లడించారు.
"క్రికెట్‌కే కాకుండా, ఇతర క్రీడలకు మంచి ఆదరణ ఉందని ఈ సారి జరిగిన పారిస్ ఒలింపిక్స్ నిరూపించాయి. భారత అభిమానులు కూడా ఈ క్రీడలను చూసేందుకు చాలా ఆసక్తి చూపించారు. వ్యూవర్‌షిప్,అడ్వర్టైజర్ల విషయంలో మేం ఎదుర్కొన్న ఈ పరీక్ష సక్సెస్ అయ్యింది. ఇక ఈ ఒలింపిక్స్ కవరేజీ ప్రపంచస్థాయిలో ఉండటమే కాకుండా, మాజీ ఒలింపియన్స్‌తో ప్రత్యేక చర్చా కార్యక్రమాల ద్వారా కూడా మేము అభిమానులను ఆకట్టుకోగలిగాం. ప్రతీ ఈవెంట్‌కు సంబంధించిన లైవ్, అలాగే నాన్‌లైవ్ కవరేజీతో రెండు వారాల పాటు నిరంతరం టెలికాస్ట్ చేశాం. ఇక క్రీడలను అభిమానులకు దగ్గర చేసినట్లే, తమ వినియోగదారులను ప్రకటనదారులకు చేరువ చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది" అని సీఈవో కిరణ్ తెలిపారు.