తెలంగాణ

telangana

ఒలింపిక్ విన్నర్స్​కు మెడల్​తో పాటు ఆ మిస్టరీ​ గిఫ్ట్ బాక్స్ - దాని ప్రత్యేకత ఏంటంటే? - Paris Olympics 2024 Gift Box

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 5:24 PM IST

Paris Olympics 2024 Gift Box : పారిస్ ఒలింపిక్స్ క్రీడలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మెడల్​తో పాటు ఓ గిఫ్ట్ బాక్సును అందిస్తున్నారు. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి అందులో ఏముంది? ఎవరు తయారు చేశారు? దాని ప్రత్యేకతలు ఏంటి? తెలుసుకుందాం పదండి.

source Associated Press
Paris Olympics 2024 Gift Box (source Associated Press)

Paris Olympics 2024 Gift Box :గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్​లో పారిస్ ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నాయి. అయితే ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచినవారికి మెడల్​తో పాటు ఓ గిఫ్ట్ బాక్స్ ఇస్తున్నారు. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి అందులో ఏముంది? దాని విశిష్టత ఏంటి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శనివారం ఫ్రాన్స్, ఫిజీ మధ్య జరిగిన రగ్బీ ఫైనల్ మ్యాచ్​లో ప్రాన్స్​ విజయం సాధించింది. ఫిజీని ఫైనల్​లో ఓడించడం వల్ల ఫ్రాన్స్​కు గోల్డ్ మెడల్ దక్కింది. అప్పుడు ఫ్రాన్స్ రగ్బీ టీమ్ కెప్టెన్ ఆంటోయిన్ డుపాంట్, తన సహచరులతో కలిసి గిఫ్ట్ బాక్సును పట్టుకున్నారు. అలాగే వెండి, కాంస్య పతక విజేత జట్లకు కూడా గిఫ్ట్ బాక్సులను అందజేశారు. అప్పుడు వీక్షకుల దృష్టిలో ఈ గిఫ్ట్ బాక్సు పడింది. దీంతో అందులో ఏముంటందని నెట్టింట్లో అందరు తెగ సెర్చ్ చేస్తున్నారు.

మెడల్​తో పాటు గిఫ్ట్ బాక్స్ - ఒలింపిక్స్​లో గెలుపొందిన వారికి మెడల్​తో పాటు ఓ గిఫ్ట్ బాక్స్​ ఇస్తారు. అందులో ఒలింపిక్స్​కు సంబంధించిన అధికారక పోస్టర్​ను ఉంచుతారు. బంగారం, రజతం, కాంస్యం ఇలా ఏ పతక విజేతలకైనా ఈ గిఫ్ట్ బాక్సును ఇస్తారట. ఈ ఒలింపిక్ పోస్టర్​ను పారిస్ చిత్రకారుడు ఉగో గట్టోని డిజైన్ చేశారు. ఈ పోస్టర్ రూపకల్పనకు ఆయనకు దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందట. ఈ పోస్టర్​ను ఈ ఏడాది మార్చి 24న పారిస్​లోని మ్యూసీ డి ఓర్సే మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ పోస్టర్​ నగర విశిష్టత తెలియజేసేలా తీర్చిదిద్దారు. అలాగే పోస్టర్​లో ఈఫిల్ టవర్, సీన్ రివర్ వంటి ఫ్రెంట్ స్మారక చిహ్నాలు ఉంటాయి. అలాగే ఈ పోస్టర్​ను ఆన్‌ లైన్​లోనూ కొనుగోలు చేయవచ్చు.

మస్కట్ ఇదే - ఒలింపిక్స్ పేరు వినగానే చాలా మందికి ఐదు రింగుల చిహ్నమే గుర్తొస్తుంది. దీంతో పాటే ఓ ముద్దొచ్చే మస్కట్‌ కూడా మరికొంతమందికి గుర్తొస్తుంది. అయితే ఈ సారి పారిస్‌ ఒలింపిక్స్ 2024లో పెద్ద పెద్ద నీలి కళ్లతో ఉన్న ఫ్రీజ్‌ అనే మస్కట్‌ దర్శనమిస్తోంది. ఫ్రెంచి సంప్రదాయంలో కీలకమైన ఫ్రీజియన్‌ క్యాప్‌ ఆధారంగా దీనిని రూపొందించారు. అలాగే విజేతలకు అందించిన మెడల్స్ వెనుక ఫ్రెంచ్ భాషలో బ్రావో అని రాసి ఉంటుంది.

పడి లేచిన కెరటం ఈ భారత షూటింగ్ స్టార్ - ఆ ఒక్క సంఘటనతో ఒలింపిక్ విజేతగా నిలిచి! - PARIS OLYMPICS Sarabjot Singh

ఒకే ఒలింపిక్స్​లో రెండు మెడల్స్​ సాధించిన తొలి మహిళ - మను బాకర్ కన్నా ముందు ఈమెనే! - Paris Olympics 2024

ABOUT THE AUTHOR

...view details