Paris Olympics 2024 Indian hockey team :క్రీడలు, రాజకీయం, చదువు, వ్యాపారం ఇలా ఏ రంగంలో రాణించాలన్నా మనోధైర్యం చాలా అవసరం. ఓటమి భయం కూడా ఉండకూడదు. అలాగే శారీరకంగా బలంగా ఉండడంతో పాటు మానసికంగానూ దృఢంగా ఉండాలి. అందుకే పారిస్ ఒలింపిక్స్‌లో రాణించేందుకు భారత పురుషుల హాకీ జట్టు క్రీడాకారులకు ఆల్ఫ్స్ పర్వత శిఖరమైన గ్లేసియర్ 3000పై నడవడం, సైక్లింగ్ చేయడం వంటివి చేయించారు లైఫ్ కోచ్ మైక్ హార్న్. అలానే వారి మనసులో ఉన్న భయాలను, ఆందోళలను దూరం చేసేలా కఠినమైన శిక్షణ ఇచ్చారు. అందుకోసం మంచు గడ్డలపై నడిపించడం, గడ్డిపై నిద్రపోవడం వంటివి చేయించారు.
సూపర్ సక్సెస్ లైఫ్ కోచ్ - 2011 ప్రపంచ కప్ విజేత అయిన టీమ్ ఇండియాకు, 2014 ఐపీఎల్ సీజన్ విన్నర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు, 2014 ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఛాంపియన్ జర్మన్ జట్టుకు హార్న్ లైఫ్ కోచ్‌గా వ్యవహరించారు మైక్ హార్న్. ఆయన జట్లు లేదా క్రీడాకారులకు మానసిక దృఢంగా ఉండేలా శిక్షణ ఇస్తుంటారు. ఒత్తిడిని జయించేందుకు చిట్కాలను అందిస్తుంటారు. అలానే పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత పురుషుల హాకీ జట్టు కూడా హార్న్ శిక్షణ ఇచ్చారు.
మూడు రోజుల పాటు కార్యక్రమాలు(Indian hockey team Training) -శిక్షణలో భాగంగాస్విట్జర్లాండ్లోని సానెన్ గ్రామంలో మొదటి రోజు రాత్రి బూట్ క్యాంప్‌లో భారత పురుషుల హాకీ జట్టు - శారీరక, మానసిక దృఢత్వం కోసం పలు సాహసోపేత కార్యక్రమాలు చేసింది. రెండో రోజు సైక్లింగ్, కేబుల్ కార్ రైడ్ వంటివి చేసింది. ఆ తర్వాత టీమ్ అంతా కలిసి పొలంలో ఎండు గడ్డిపై నిద్రించింది. ఆఖరి రోజు వాటర్ ఫాల్స్‌లో ఈత కొట్టింది. ఈ కార్యకలాపాలు ఆటగాళ్లకు శారీరక బలాన్నే కాకుండా మానసికంగానూ దృఢంగా చేశాయి.
"మొదట్లో హాకీ జట్టు ఆటగాళ్లు కొంత ఆందోళనగా కనిపించారు. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. మంచు గడ్డలపై వారిని నడిపించాను. వారు నా సవాళ్లను స్వీకరించి ఫాలో అయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. అందుకే ఈ సారి ఆ జట్టుపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఈసారి జట్టు బలాలపై దృష్టి పెట్టడం, మానసికంగా దృఢంగా ఉండాలని వారికి సలహా ఇచ్చాను."
అని మైక్ హార్న్ అన్నారు.
మంచు గడ్డలపై వాకింగ్, ఎండుగడ్డిపై నిద్ర - భారత హాకీ ప్లేయర్లకు హార్డ్ ట్రైనింగ్! - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024
Paris Olympics 2024 Indian hockey team : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని ముద్దాడిన భారత పురుషుల హాకీ జట్టు, ఈ సారి ఎలాగైనా పారిస్‌లో పతకాన్ని సాధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హాకీ జట్టు ఆటగాళ్లలో మనోధైర్యం, కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు లైఫ్ కోచ్ మైక్ హార్న్ నేతృత్వంలో కఠినమైన ట్రైనింగ్ ఇచ్చారు. మంచు గడ్డలపై నడవడం, ఎండు గడ్డిపై రాత్రంతా పడుకోవడం వంటివి చేశారు. పూర్తి వివరాలు స్టోరీలో.
Paris Olympics 2024 Indian hockey team (source Associated Press)
Published : Jul 31, 2024, 6:25 PM IST