PARIS OLYMPICS 2024 Indian Athetes Two Medals : పారిస్ ఒలింపిక్స్ పతకాల వేటలో భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. భారత యువ షూటర్ మను బాకర్ స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది. ఈ క్రమంలో వ్యక్తిగత విభాగంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన భారత్ అథ్లెట్ల గురించి తెలుసుకుందాం.
1. సుశీల్ కుమార్
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ వ్యక్తిగత విభాగంలో రెండు సార్లు ఒలింపిక్ పతకాలను సాధించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకం అందుకున్నాడు. అలాగే 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ రజతం సాధించాడు. అయితే 2021లో జరిగిన ఓ ఘటన సుశీల్ కుమార్ రెజ్లింగ్ కెరీర్‌ను దెబ్బతిసింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్‌ను హత్య చేశారని సుశీల్ కుమార్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుశీల్ కుమార్ తిహాడ్ జైలులో ఉన్నారు.
2. పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రజత పతకం రావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్య పతకం గెలుచుకుంది. ఈ సారి పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పతకం గెలిచి మూడో సారి ఒలింపిక్ విజేతగా నిలవాలని ప్రయత్నిస్తోంది.
3. మను బాకర్
భారత స్టార్ షూటర్ మను బాకర్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలను గెలుచుకుంది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాల గెలిచిన భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ఇప్పటికే కాంస్య పతకాన్ని అందుకోగా, మంగళవారం జరిగిన మిక్స్డ్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో సరబ్ జోత్ సింగ్‌తో కలిసి దక్షిణ కొరియాకు చెందిన లీ వొన్‌హో, ఓ హైజిన్ జోడీని మట్టికరిపించి మరో కాంస్య పతకాన్ని ముద్దాడింది. దీంతో మను బాకర్ ఖాతాలో రెండు పతకాలు పడ్డాయి. అలాగే ఆగస్టు 2న మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్ జరగనుంది. ఈ రౌండ్ లో క్వాలిఫై అయితే మరో పతకం మను బాకర్ ఖాతాలో చేరుతుంది. అప్పుడు ఒలింపిక్స్ లో అత్యధిక పతకాలను సాధించిన అథ్లెట్‌గా మను చరిత్ర సృష్టించనుంది.
ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌లో పోటీ - ఆమె పోరాటానికి ప్రతిఒక్కరూ ఫిదా! - 2024 Paris Olympics
రెండు ఒలింపిక్ పతకాలు - మను కన్నా ముందు వీరిదే ఆ ఘనత! - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024
PARIS OLYMPICS 2024 : ఒలింపిక్ పతకాల వేటలో భారత్ దూసుకెళ్తోంది. భారత యువ షూటర్ మను బాకర్ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాల సాధించి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన భారత అథ్లెట్లు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
PARIS OLYMPICS 2024 (source ANI and Associated Press)
Published : Jul 30, 2024, 10:54 PM IST