క్వార్టర్ ఫైనల్‌కు అడుగు దూరంలో భారత హాకీ టీమ్ - ఐర్లాండ్‌పై విజయం - PARIS OLYMPICS 2024
Published : Jul 30, 2024, 1:00 PM IST
|Updated : Jul 30, 2024, 6:40 PM IST
Paris Olympics 2024 July 30 Events :పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మహిళా షూటర్ మను బాకర్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన మను బాకర్ నేడు (జులై 30) మరో పతకాన్ని అందుకునే అవకాశం ఉంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పోరులో సరబ్‌జ్యోత్‌తో కలిసి బరిలోకి దిగనుంది. సౌత్ కొరియా ద్వయం (లీ-యెజిన్)తో మధ్యాహ్నం 1 గంటకు ఈ పోరు ప్రారంభం కానుంది.
LIVE FEED
క్వార్టర్ ఫైనల్‌కు అడుగు దూరంలో
హాకీ -పారిస్ ఒలింపిక్స్ 2024 హాకీలో భారత్ జట్టు ఐర్లాండ్ టీమ్‌ను ఓడించింది. థర్డ్ పూల్ మ్యాచ్‌లో 2-0తేడాతో పరాజయం రుచి చూపించింది.
బ్యాడ్మింటన్ - మెన్స్ డబుల్ ఈవెంట్లో సాత్విక్-చిరాగ్ జోడీ విజయం సాధించారు.
ఆర్చరీ - ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో భజన్ కౌర్ రౌండ్ 32కు అర్హత సాధించింది.
- తాజాగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో భారత ప్లేయర్లు మను బాకర్, సరబ్‌జోత్ సింగ్ అరదగొట్టారు. సౌత్‌కొరియాకు చెందిన లీ వొన్‌హో, ఓ హైజిన్ జోడీని 16-10 పాయింట్ల తేడాతో ఓడించారు.
- ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ప్లేయర్ మను బాకర్ అరుదైన రికార్డును నమోదు చేసింది. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మను బాకర్ చరిత్రకెక్కింది.