Paris Olympics 2024 July 27 Events : పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా సోమవారం (జులై 27)న జరిగిన షూటింగ్ ఈవెంట్‌లోభారత్‌కు మరో పతకం దక్కే సూచలను కనిపిస్తోంది. తాజాగా జరిగిన 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్‌లో భారత షూటర్స్ మను బాకర్- సరబ్‌జోత్ సింగ్ జోడీ 580 పాయింట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుని కాంస్యం బరిలో చోటు దక్కించుకుంది.
క్వాలిఫికేషన్ పోరులో టాప్-4లో నిలిచిన వారే ఈ ఫైనల్ పతక పోరుకు అర్హత సాధిస్తారు. ఇందులో మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారు గోల్డ్ మెడల్ కోసం పోటీలో దిగుతారు. అక్కడ ఓటమిపాలైతే ఆ ప్లేయర్లు రజతాన్ని అందుకుంటారు. ఇక, మూడు, నాలుగు స్థానాల్లోకి వచ్చిన వారు కాంస్య పోరు కోసం పోటీపడుతారు. ఇందులో భాగంగా మంగళవారం మన భారత జోడో సౌత్‌కొరియా ద్వయంతో పోటీ పడనుంది. అయితే ఇదే విభాగంలో మరో భారత జోడీ రిథమ్-అర్జున్ చీమా మాత్రం పదో స్థానానికి పరిమితమైంది.
ఫైనల్‌లో రమితా ఓటమి
మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో పాల్గొన్న భారత షూటర్ రమిత జిందాల్‌కు నిరాశ తప్పలేదు. సోమవారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో ఆమె ఏడో స్థానానికి పరిమితమై పతకాన్ని కోల్పోయింది. ఇక బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీశా జోడీ కూడా ఓటమిపాలైంది. గ్రూప్ దశలో జపాన్ ద్వయం చేతిలో వరుస గేమ్‌లు కోల్పోయి ఈ విభాగం నుంచి నిష్క్రమించింది.
మను ఖాతాలో ఆ రేర్ రికార్డ్
ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో మను బాకర్ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ మిక్స్‌డ్ ఈవెంట్‌లోనూ మను పతకాన్ని సొంతం చేసుకుంటే ఒలింపిక్ చరిత్రలో ఓ రేర్ రికార్డు సృష్టించినట్లే అని క్రీడానిపుణలు అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ విశ్వక్రీడల్లో ఒకటికి మించి పతకాలు సాధించిన భారత క్రీడాకారులు ఇద్దరే ఉన్నారు. ఒకరేమో రెజ్లర్ సుశీల్ కుమార్, మరొకరేమో షట్లర్ పీవీ సింధు. ఈ క్రీడల్లో వీళ్లిద్దరూ రెండేసి పతకాలు సాధించారు. కానీ ఒక్క ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత క్రీడాకారులు ఎవ్వరూ లేరు. ఇప్పుడీ ఈ రికార్డు సాధించే అవకాశం మను చేతిలో ఉంది.
ఫ్రొఫెషనల్ చెఫ్‌లు, అదిరిపోయే వంటకాలు - ఒలింపిక్స్ విలేజ్‌లో మన అథ్లెట్లు ఏటువంటి ఆహారం తింటున్నారో తెలుసా? - Paris Olympics 2024
భారత్ ఖాతాలోకి మరో రెండు పతకాలు వచ్చే ఛాన్స్ - నేటి షెడ్యుల్ ఇదే - Paris Olympics 2024