తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆశలన్నీ వీరిపైనే! - పారిస్ ఒలింపిక్స్​లో ఈ ఇండియన్ అథ్లెట్లు అదరగొడుతారా? - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 Indian Contestants : పారిస్ ఒలింపిక్స్​కు మరికొద్ది రోజులే సమయం ఉన్నందున మన ఇండియన్ అథ్లెట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వివిధ క్రీడలకు సంబంధించి మొత్తం 117 మంది ఈ పతకాల వేటలో పాల్గొననున్నారు. మరి వీరిలో ఎవరిపై క్రిడాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయంటే?

Paris Olympics 2024
Paris Olympics 2024 (ANI, Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 10:31 AM IST

Paris Olympics 2024 Indian Contestants :2024 పారిస్ ఒలింపిక్స్‌కి భారత అథ్లెట్లు రెడీ అవుతున్నారు. జులై 26 నుంచి మొదలవుతున్న అతిపెద్ద స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో 117 మంది భారత్‌ అథ్లెట్లు పాల్గొంటున్నారు. వీరిలో కొందరు తప్పక దేశానికి పతకం అందిస్తారనే అంచనాలు నెలకొన్నాయి. వారెవరంటే?

పీవీ సింధు (బ్యాడ్మింటన్)
స్టార్ షట్లర్పీవీ సింధు రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని ముద్దాడింది. పెద్ద టోర్నమెంట్లలో సింధు సక్సెస్‌ రేటు ఎక్కువ. మ్యాచ్‌లను ముగించడం, ఒత్తిడి పరిస్థితులను అధిగమించడంలో మెరుగ్గా వ్యవహరిస్తే మళ్లీ పతకాలు గెలిచే ఛాన్సెస్‌ ఉన్నాయని అభిమానులు అంటున్నారు.

నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)
మెన్స్‌ జావెలిన్‌లో డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అతను నిలకడగా 87-89 మీటర్ల పరిధిలో జావెలిన్‌ విసురుతాడు. ఇప్పటి వరకు చాలా మేజర్‌ ఈవెంట్స్‌లో పతకం సాధించాడు.

మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్)
టోక్యోలో రజత పతకం సాధించిన మీరాబాయి చాను పారిస్‌లో స్వర్ణంపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. 200-210 కిలోగ్రాముల పరిధిలో ట్రైనింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఆమెకు ఎక్కువ అనుభవం ఉంది. అయితే గాయాల కారణంగా ఆమె 2023 నుంచి పరిమితంగా పోటీల్లో పాల్గొంది.

లోవ్లినా బోర్గోహైన్ (బాక్సింగ్)
టోక్యోలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న లోవ్లినా బోర్గోహైన్ 69 కేజీల విభాగంలో దూసూకెళ్తోంది. ఇటీవల వరుసగా విజయాలు సాధించింది. భారత్‌కి పతకం అందిస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

సిఫ్ట్ కౌర్ సమ్రా (షూటింగ్)
మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో ప్రపంచ రికార్డు సాధించిన సిఫ్ట్ కౌర్ సమ్రా ఒత్తిడిలోనూ రాణిస్తోంది. ఆమె బలాలు ఉన్నప్పటికీ, భారత షూటర్లు చారిత్రాత్మకంగా ఒలింపిక్స్‌లో పతకాలు గెలవడానికి ఇబ్బంది పడ్డారు.

వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్)
మూడు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ వినేశ్​ ఫోగట్. ఆమె కఠినమైన 50 కేజీల విభాగంలో పోటీ పడుతుంది. ఇటీవల కాలంలో తక్కువ పోటీల్లో పాల్గొంది.

నిఖత్ జరీన్ (బాక్సింగ్)
నిఖత్ జరీన్, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్. స్ట్రాంగ్‌ టెక్నిక్స్‌తో స్థిరంగా రాణిస్తోంది. తన మొదటి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఆమె అధిక అంచనాలు, ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్)
అమన్ సెహ్రావత్, ఆసియా ఛాంపియన్ అలాగే మాజీ ప్రపంచ U23 ఛాంపియన్ కూడా. వేగంగా కదిలే టెక్నిక్‌, ఓర్పుకు ఇతడు ప్రసిద్ధి. సీనియర్ సర్క్యూట్ అనుభవం తక్కువ. అయితే అమన్ సెహ్రావత్ పతకం గెలుస్తాడనే అంచనాలు భారీగా ఉన్నాయి.

అదితి అశోక్ (గోల్ఫ్)
అదితి అశోక్, ఇటీవలి ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన అగ్రశ్రేణి భారత గోల్ఫ్ క్రీడాకారిణి. ప్రస్తుతం సూపర్ ఫామ్​లో ఉన్న ఆమె డ్రైవింగ్ డిస్టెన్సెస్‌ను కూడా మెరుగుపరుచుకుంది. కొన్నిసార్లు చివరి రౌండ్ ఒత్తిడికి గురవుతుంటుంది. ఆ ఇబ్బందీ మాత్రం లేకుంటే భారత్‌ ఖాతాలో ఓ ఒలింపిక్‌ పతకం కచ్చితంగా చేరుతుంది.

సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్ డబుల్స్)
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, మాజీ ప్రపంచ #1 డబుల్స్ టీమ్‌. ప్రధాన టోర్నమెంట్‌లలో అద్భుత ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నారు. అయితే, సాత్విక్ భుజం గాయం, ఇటీవలి ఫామ్‌ కాస్త ఆందోళన కలిగిస్తోంది.

పురుషుల హాకీ జట్టు
భారత పురుషుల హాకీ జట్టు, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. పారిస్‌లో గోల్డ్‌ మెడల్‌పై కన్నేసింది. పీఆర్ శ్రీజేష్, హర్మన్‌ప్రీత్ సింగ్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో, టీమ్‌ బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. గ్రూప్‌ స్టేజ్‌ని దాటి నాకౌట్స్‌కి చేరితే పతకం తప్పక గెలిచే అవకాశం ఉంది.

పారిస్​ ఒలింపిక్స్​ - ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది అథ్లెట్లు

రోప్ క్లైంబింగ్​, టగ్​ ఆఫ్ వార్ - ఒలింపిక్స్​లోని ఈ విచిత్రమైన క్రీడల గురించి తెలుసా? - Paris Olympics 2024

ABOUT THE AUTHOR

...view details