Paris Olympics 2024 :ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఎంతో మంది భారత ప్లేయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు ఛాంపియన్‌షిప్‌లు సాధించిన దిగ్గజాలు కూడా పారిస్ వేదికగా మరిన్ని ఘనతనలను తమ ఖాతాలో వేసుకోవాలన్న కసితో ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రం తమ సుదీర్ఘ కెరీర్లో ఒలింపిక్ పతకాన్ని సాధించుకోవాలన్న వెలితిని తీర్చుకోకుండానే కెరీర్లు ముగిస్తారా అన్న బాధలో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో టెన్నీస్ స్టార్ రోహన్ బోపన్న, ఆర్చర్ దీపిక కుమారీ, టేబుల్ టెన్నీస్ ప్లేయర్ శరత్ కమల్. ఈ ముగ్గురూ తమ కెరీర్లో చివరిసారి ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరీ ఈ ప్లేయర్ల ఫామ్ ఎలా ఉందంటే?
బోపన్న పసిడి పట్టేనా?
పారిస్ ఒలింపిక్స్‌లోని పాల్గొంటున్న భారత టీమ్‌లో రోహన్ బోపన్నే పెద్ద వయస్కుడు. ప్రస్తుతం ఆయనకు 44 ఏళ్లు. అయితే ఈ లేటు వయసులోనే ఆయన మునుపటికంటే జోరుగా ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పాటు మియామి టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడీ అనుభవంతోనే పారిస్ బరిలో దిగుతున్నాడు. అదే ఫామ్‌తో తన చివరి ప్రయత్నంలోనూ పతకాన్ని పట్టాలనే సంకల్పంతో ఉన్నాడు.
2016 రియో ఒలింపిక్స్‌లో సానియా మీర్జాతో మిక్స్డ్ డబుల్స్ ఆడాడు. ఆ గేమ్‌లో ఈ జోడీ సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్‌లో త్రుటిలో ఓటమిపాలైంది. కాంస్యమైనా దక్కుతుందనుకుంటే అది కూడా జరగలేదు.
మరోవైపు బోపన్నకు తోడుగా శ్రీరామ్ బాలాజీ మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనున్నాడు. ఇప్పటివరకు మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జతగా దూసుకెళ్తున్న బోపన్న, ఈ కొత్త పార్ట్నర్తో ఏమేరకు సమన్వయం సాధిస్తాడన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అన్నీ కలిసొస్తే ఈ ఇద్దరిలోనూ విజయం సాధించగల సత్తా ఉంది.
2004 నుంచే పతకాల వేట
2004 ఏథెన్స్ ఒలింపిక్స్ నుంచి క్రమం తప్పకుండా క్రీడలకు వెళ్తున్నాడు ఆచంట శరత్ కమల్. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ పతకాన్ని ముద్దాడేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. యంగ్ ప్లేయర్లకు దీటుగా ఆడుతూ ర్యాంకుల్లోనూ మెరుగైన ఈ స్టార్ ప్లేయర్ తన చివరి ప్రయత్నంలో ఎలాగైనా మెడల్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో సత్తా చాటాడు.