Paris Olympics 2024 Boxer Lovlina on points System : పారిస్ ఒలింపిక్స్ 2024లో బాక్సింగ్‌లో వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా బాక్సింగ్ విభాగంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్జీరియా బాక్సర్ లింగ వివాదం పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే. అది ఇంకా కొనసాగుతూనే ఉండగా ఇప్పుడు స్కోరింగ్ విధానంపై కూడా తీవ్రంగా చర్చలు మొదలయ్యాయి.
పోరులో తొలి నుంచీ ఆధిక్యం సాధించిన కూడా భారత స్టార్ బాక్సర్ నిశాంత్ దేవ్‌ను కాకుండా ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఇప్పుడు అదే అన్యాయం మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ విషయంలోనూ జరిగిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులపై తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, లవ్లీనా మహిళల 75 కేజీల విభాగంలో పోటీ చేసి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడింది. ఈ నేపథ్యంలో తన ఓటమిపై, అలాగే స్కోరింగ్ విధానంపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఒలింపిక్స్‌లో బాక్సింగ్ రూల్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
"ఈ ఓటమి నన్ను ఎంతగానో నిరాశ పరిచింది. ఒలింపిక్స్ ముందు ఏం సాధించాలని బలంగా ఆశించానో ఇప్పుడు దానిని చేజార్చుకున్నాను. అసలు నేను ఎక్కడ, ఎందుకు వెనుకబడ్డానో పరిశీలించుకుంటాను. ఆ లోటు ఏమిటో ముందుగానే తెలిస్తే ఛాంపియన్‌గా నిలిచి ఉండేదాన్ని. ఇతర క్రీడలతో పోలిస్తే బాక్సింగ్ భిన్నంగా ఉంటుంది. ఆటలో ఏం జరిగిందనేది తెలుసుకోవడం ఎంతో కష్టం. మనం గెలిచామని అనుకున్నా అది న్యాయ నిర్ణేతలపైనే ఆధారపడి ఉంటుంది. వారికి స్కోరింగ్ విధానం ఏ విదంగా ఉంటుందో తెలీదు. అది తప్పా? రైటా? అనేది చెప్పలేని పరిస్థితి ఉంటుంది. రిజల్ట్ ఎలా ప్రకటించినా అంగీకరించాల్సిందే" అని లవ్లీనా ఘాటుగా మాట్లాడింది.
IBAపై తైవాన్ లీగల్ యాక్షన్! -పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న తైవాన్ మహిళా బాక్సర్‌ను పురుషుడిగా పేర్కొంటూ అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(IBA) చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమైంది. దీనిపై తైవాన్ చట్టపరమైన చర్యలకు సిద్ధమైందని తెలిసింది. కాగా, తైవాన్ బాక్సర్ యు తింగ్ 57 కేజీల విభాగంలో మెడల్‌ను ఖాయం చేసుకుంది. ఈ క్రమంలోనే తమ బాక్సర్‌పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐబీఏకు తైవాన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందింది. అవసరమైతే దావా వేసేందుకు కూడా వెనుకాడబోమని తైపీ పేర్కొనట్లు కథనాలు వస్తున్నాయి.
వారెవా వినేశ్! చరిత్ర సృష్టించావ్ - అప్పుడు రోడ్డుపై ఇప్పుడు పోడియంపై - Paris Olympics 2024 Vinesh Phogat
ఇది ట్రైలర్ మాత్రమే- ఫైనల్లో సినిమా చూపిస్తా: నీరజ్ చోప్రా - Paris Olympics 2024