- బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ ఎస్ ప్రణయ్ శుభారంభం
- సింగిల్స్ గ్రూప్ స్టేజ్‌లో ప్రణయ్ విజయం
- 21-18, 21-12 తేడాతో జర్మనీ షట్లర్‌పై విక్టరీ
- 31 జులైన తదుపరి మ్యాచ్ ఆడనున్న ప్రణయ్
పారిస్ ఒలింపిక్స్: మనూ బాకర్‌కు ప్రధాని ఫోన్- పతక విజేతతో మోదీ చిట్‌చాట్ - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024
Published : Jul 28, 2024, 2:19 PM IST
|Updated : Jul 28, 2024, 9:10 PM IST
Paris Olympics 2024 All Indian Events:పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఆదివారం (జులై 28)న పలు ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ షూటర్ మనూ బాకర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మనూ బాకర్తోపాటు భారత్‌కు చెందిన అథ్లెట్లు పలు ఈవెంట్లలో పోటీ పడనున్నారు.
LIVE FEED
- కాంస్యం సాధించిన మనూ బాకర్‌కు ప్రధాని ఫోన్
- పతక విజేత మనూతో ఫోన్లో మాట్లాడిన మోదీ
- మనూను అభినందించిన మోదీ
- మహిళల ఆర్చరీ టీమ్ విభాగంలో నిరాశ
- క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన భారత్
- పోరాడి ఓడని అంకిత భకత్, భజన్, దీపికా
- టెబుల్ టెన్నిల్లో మనికా బాత్ర సంచలనం
- మహిళల సింగిల్స్ ఈవెంట్లో మనికా విజయం
- ఈ విజయంతో రౌండ్ 32కు అర్హత
- మహిళల బాక్సింగ్ ఈవెంట్లో నిఖత్ జరీన్ గుడ్ స్టార్ట్
- 50కేజీల బాక్సింగ్ రౌండ్16లో 5-0తో నిఖత్ విజయం
- ఆగస్టు 1న చైనా అథ్లెట్ వు యుతో తలపడనున్న నిఖత్
- 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్‌కు అర్జున్ బబుత
- క్వాలిఫికేషన్ ఈవెంట్లో సత్తాచాటిన షూటర్ అర్జున్
- 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అర్జున్ బబుత విజయం
- 630.1 పాయింట్లతో 7వ స్థానం దక్కించుకున్న అర్జున్
- జులై 29 మధ్యాహ్నం 3.30 గంటలకు ఫైనల్ ఆడనున్న అర్జున్
- ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ సందీప్ సింగ్‌కు నిరాశ
- 629.3 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితమైన సందీప్
- టాప్-8లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు
- భారత్ ఖాతాలో తొలి పతకం
- 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో మనుకు కాంస్యం
- 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మను
- ఇదే ఈవెంట్లో ఓయె జిన్ (స్వర్ణం), కిమ్ యెజి (రజతం)
- టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ శుభారంభం
- మహిళల సింగిల్ ఈవెంట్స్ రౌండ్ 64లో 4-0తో విజయం
Ramita Jindal Paris Olympics 2024 : మహిళల 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో భారత షూటర్ రమిత జిందాల్ ఫైనల్‌కు చేరుకుంది. మొత్తం 631.5 పాయింట్లు సాధించి 5వ స్థానంతో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Balraj Panwar Paris Olympics 2024 : రోయింగ్‌లోని రిపెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాల్‌రాజ్ పన్వార్ చాటాడు. రెండో రౌండ్‌లో అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరాడు. అయితే ఈ గేమ్‌లో మొనాకో ప్లేయర్ క్వింటిన్ ఆంటోగ్నెల్లి ఫస్ట్ ప్లేస్ సాధించగా, బాల్‌రాజ్ మాత్రం రెండో స్థానంతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.
PV Sindhu Paris Olympics :స్టార్ షట్లర్ పీవీ సింధు తన పారిస్ ఒలింపిక్స్ జర్నీని విజయంతో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మాల్దీవుల ప్లేయర్ అబ్దుల్ రజాక్‌పై 21-9, 21-6 తేడాతో గెలిచింది. అయితే కేవలం 29 నిమిషాల్లోనే ముగిసింది. ఇక గ్రూప్ స్టేజ్‌లో సింధు, ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో తలపడనుంది. ఈ మ్యాచ్ బుధవారం జరగనుంది.